close

తాజా వార్తలు

Published : 24/01/2020 13:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్ - 1 PM

1. జగన్‌ తిక్క చేష్టలతో ఏపీకి అప్రతిష్ఠ : చంద్రబాబు

ఏపీ సీఎం జగన్‌ నియంత పోకడలు, తిక్క చేష్టలతో రాష్ట్రం అప్రతిష్ఠ పాలవుతోందని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాపై తప్పుడు కేసులు బనాయించడాన్ని ఓ ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. ‘మందడంలోని పాఠశాలలో తరగతి గదిని పోలీసులు ఆక్రమించారు. విద్యార్థులను బయటకు పంపడాన్ని తల్లిదండ్రులు మీడియా దృష్టికి తీసుకెళ్లారు. విధి నిర్వహణలో భాగంగా పాఠశాలకు వెళ్లిన విలేకరులు, ఫొటోగ్రాఫర్లపై నిర్భయ కేసు పెట్టడం ప్రభుత్వ కక్ష సాధింపునకు పరాకాష్ఠ.’ అని చంద్రబాబు విమర్శించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. జగన్‌ది జగ్లక్‌ పాలన: సీపీఐ

ఏపీ రాజధాని అంశంపై గత 38 రోజులుగా ఆందోళనలు జరుగుతుంటే సీఎం జగన్‌ ఏం మాట్లాడుతున్నారో అర్ధం కావటం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఎన్నికైన ప్రభుత్వం ఏదైనా చేయవచ్చని సీఎం అంటున్నారు. శాసనమండలికి రూ.5కోట్లు ఖర్చు చేసేందుకు భారమంటున్నారు. రాజధాని కేసులు వాదించే న్యాయవాదులకు రూ.5కోట్లు ఎలా చెల్లిస్తారు? జగన్‌ది తుగ్లక్‌ పాలన కాదు జగ్లక్‌ పాలన’’ అని రామకృష్ణ విమర్శించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. అమరావతి, విశాఖకు అవార్డులు

స్మార్ట్‌ సిటీ మిషన్‌ లక్ష్యాలు చేరు కోవడంలో ఉత్తమ ఫలితాలు కనబర్చిన నగరాలుగా అమరావతి, విశాఖ అవార్డులు సాధించాయి. రికగ్నేషన్ ఆఫ్‌ పెర్ఫామెన్స్‌ అంశంలో అమరావతికి, ముడసర్లలో ఫ్లోటింగ్ సోలార్‌ ఏర్పాటుపై    విశాఖకు అవార్డులు దక్కాయి. అత్యుత్తమ ప్రదర్శనతో సూరత్‌ నగరం ‘సిటీ’ అవార్డును కైవసం చేసుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. కరీంనగర్‌లో కొనసాగుతున్న పోలింగ్‌

కరీంనగర్‌ నగరపాలక సంస్థ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. మొత్తం 60డివిజన్లకు గాను రెండు డివిజన్లు ఎకగ్రీవం కావడంతో మిగిలిన 58 డివిజన్లకు ఇవాళ పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. 369 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఉదయం 7గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 5గంటల వరకు కొనసాగనుంది.  2,72,692 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. తెరాస నుంచి 58, భాజపా నుంచి 53, కాంగ్రెస్‌ నుంచి 51 మంది, తెదేపా నుంచి 14 మంది, స్వతంత్రులు 157 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. మమత వృద్ధాశ్రమంపై కేసు నమోదు

కీసర పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని నాగారంలో ఉన్న మమత వృద్ధాశ్రమంపై పోలీసులు కేసు నమోదు చేశారు. వృద్ధాశ్రమం పేరుతో మానసిక వికలాంగుల కేంద్రం నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అపరిశుభ్ర వాతావరణంలో నిబంధనలకు విరుద్ధంగా కొనసాగిస్తున్నారు. ఇరుకు గదుల్లో 73 మంది మానసిక వికలాంగులను గొలుసులతో బంధించారు. నిర్వాహకులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు కీసర పోలీసులు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. మరోసారి మినహాయింపు కోరిన జగన్‌

నాంపల్లిలోని సీబీఐ, ఈడీ కోర్టులో జగన్‌ అక్రమాస్తుల కేసు విచారణ కొనసాగుతోంది. ఇవాళ్టి విచారణకు సీఎం జగన్‌ మినహాయింపు కోరారు. ఎంపీ విజయసాయిరెడ్డి, ఐఏఎస్‌ అధికారిణి శ్రీలక్ష్మి, విశ్రాంత అధికారులు శామ్యూల్‌, రాజగోపాల్‌ తదితరులు సీబీఐ కోర్టుకు హాజరయ్యారు.

7. నిరసన ప్రజాస్వామ్య లక్షణం: ప్రణబ్‌

ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న శాంతియుత నిరసనలు ప్రజాస్వామ్య వ్యవస్థ మూలాలను మరింత పటిష్ఠం చేస్తాయని మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ అభిప్రాయపడ్డారు. వాదోపవాదాలు, నిరసన వ్యక్తం చేయడం ప్రజాస్వామ్య లక్షణాలని వ్యాఖ్యానించారు. భారత్‌లో ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేయడానికి చేసిన ప్రయత్నాల్ని పదే పదే మననం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. లేనిపక్షంలో నియంతృత్వ ధోరణి క్రమంగా పాతుకుపోతుందని వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. విజృంభిస్తున్న కరోనా వైరస్‌

చైనాలో కరోనా వైరస్‌ అంతకంతకూ విజృంభిస్తోంది. ఈ వైరస్‌ బారిన పడి మృత్యువాతపడ్డ వారి సంఖ్య తాజాగా 25కు చేరింది. మరో 800 మంది ఈ వ్యాధి బాధితులుగా మారినట్లు అక్కడి ప్రభుత్వ అధికారులు శుక్రవారం వెల్లడించారు. వీరిలో 177 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. వైరస్‌ను మొట్టమొదటిసారి గుర్తించిన వుహాన్‌ నగరంలో మరో 1,072 అనుమానితులకు పరీక్షలు జరుపుతున్నట్లు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న కోహ్లీ

భారత్×న్యూజిలాండ్‌ మధ్య ఆట మొదలైంది. అయిదు టీ20ల సిరీస్‌లో భాగంగా ఆక్లాండ్ వేదికగా కివీస్‌తో కోహ్లీసేన తొలి మ్యాచ్‌ ఆడుతోంది. టాస్‌ గెలిచిన కోహ్లీ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో కివీస్‌ జట్టు బ్యాటింగ్‌కు దిగింది.

10. గుంటూరులో విజయచందర్‌కు చేదు అనుభవం

 



Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.