close

తాజా వార్తలు

Published : 19/01/2020 13:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ - 1 PM

1. రాజధానిలో ఇద్దరు రైతుల మృతి

ఏపీ రాజధానిలో మరో ఇద్దరి గుండె ఆగింది. అమరావతి పరిధిలోని  వెలగపూడికి చెందిన అబ్బూరి అప్పారావు(55) గుండెపోటుతో ఈరోజు ఉదయం మృతి చెందారు. రాజధాని నిర్మాణానికి 7 ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారు. మందడం గ్రామానికి చెందిన బెజవాడ సామ్రాజ్యమ్మ గుండెపోటుతో మృతి చెందారు. రాజధాని అభివృద్ధికి ఈమెస్వచ్ఛంధంగా 20ఎకరాలు ఇచ్చారు. రాజధాని అమరావతి తరలిపోతుందని ఆవేదనతో మృతి చెందినట్లు  బంధువులు ఆరోపిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. మున్సిపల్‌ మంత్రిగా కేటీఆర్‌ విఫలం: ఉత్తమ్‌

మున్సిపల్‌ శాఖ మంత్రిగా కేటీఆర్‌ తీవ్రంగా విఫలమయ్యారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. ఆదివారం ఉదయం నల్గొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ...సీఏఏకు వ్యతిరేకంగా కేరళ, పంజాబ్‌ ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయని, సీఎం కేసీఆర్‌ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కేంద్రంలోని భాజపా ప్రభుత్వానికి తెరాస అనేక సార్లు మద్దతిచ్చిందని గుర్తు చేశారు. మున్సిపల్‌ ఎన్నికల్లో తెరాసను ఓడించేందుకు కాంగ్రెస్‌కు ఓటేయాలని ఉత్తమ్‌ విజ్ఞప్తి చేశారు.

3. కాశీంను హాజరుపర్చిన పోలీసులు

మావోయిస్టు సాహిత్యం కలిగి ఉన్నారనే కేసులో ఏ2గా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉస్మానియా యూనివర్సిటీ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డా.చింతకింది కాశీంను నిన్న అరెస్టు చేసిన పోలీసులు ఇవాళ ఉదయం హైకోర్టు సీజే నివాసంలో హాజరు పర్చారు. ఇటీవలే విరసం కార్యదర్శిగా ఎన్నికైన ఆయనను.. ఐదేళ్ల నాటి కేసులో ఇపుడు అరెస్టు చేయటం అప్రజాస్వామికమంటూ పౌరహక్కుల సంఘం హైకోర్టును ఆశ్రయించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. రైతుల మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే: లోకేశ్‌

రాజధాని కోసం స్వచ్ఛందంగా భూమి ఇచ్చిన రైతులను జగన్‌ చంపేస్తున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ కేసులతో ప్రభుత్వం రైతులను బలి తీసుకుంటుందని మండిపడ్డారు. రాజధాని అమరావతి కోసం జరుగుతున్న రైతుల మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనని లోకేశ్‌ అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. మేడారానికి పోటెత్తిన భక్తులు

మేడారంలో భక్తుల రద్దీ నెలకొంది. సమ్మక్క.. సారలమ్మను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఆదివారం కావడంతో హైదరాబాద్‌, ఖమ్మం, కరీంనగర్‌, వరంగల్‌ తదితర ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి ములుగు జిల్లా మేడారం చేరుకున్నారు. సమ్మక్క, సారలమ్మ జాతర ఏర్పాట్లను పరిశీలించారు. పనుల పురోగతిపై వివిధ శాఖల అధికారులతో సీఎస్‌ సమీక్షించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. శిర్డీలో కొనసాగుతున్న బంద్‌..!

సాయిబాబా జన్మస్థానంపై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో శిర్డీ గ్రామస్థులు ఇచ్చిన బంద్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. అయితే ఆలయ దర్శనాలు మాత్రం యథావిధిగా కొనసాగుతున్నాయి. ఆదివారం ఉదయం భక్తులు భారీ ఎత్తున బాబా దర్శనానికి తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ‘సాయిబాబా సంస్థాన్‌ ట్రస్ట్‌’ అన్ని ఏర్పాట్లు చేసింది. శిరిడీ సహా చుట్టుపక్క గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌ పాటిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’: ఆ వార్తలు అవాస్తవం

దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో తాను నటించడం లేదని కన్నడ నటుడు కిచ్చా సుదీప్‌ స్పష్టం చేశారు. ఈ సినిమాలో పోలీసు అధికారి పాత్రలో సుదీప్‌ నటించనున్నారంటూ, జనవరి 20 నుంచి ఆయన షూటింగ్‌లో పాల్గొననున్నారంటూ వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో నటుడు సుదీప్‌ సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలపై స్పందించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. ‘బ్రూ’లకు త్రిపురలో నివాసం

దాదాపు రెండు దశాబ్దాలకు పైగా త్రిపురలో తలదాచుకుంటున్న ‘బ్రూ’ (రియాంగ్‌) జాతీయులకు ఉపశమనం లభించింది. 23 ఏళ్ల క్రితం మిజోరంలో ఘర్షణలతో  పారిపోయి త్రిపురలో నివాసముంటున్న దాదాపు 30 వేలమంది ‘బ్రూ’ జాతీయులకు అక్కడే శాశ్వత నివాసం కల్పించాలని కేంద్రం, మిజోరం, త్రిపుర, బ్రూ ప్రతినిధుల మధ్య ఒప్పందం కుదిరింది.  దీంతో  వీరు త్రిపురలో అన్నిహక్కులు పొందనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. బాలికపై అత్యాచారం: యువకుడు అరెస్టు

వికారాబాద్‌ జిల్లా పరిగి బీసీ కాలనీలో దారుణం జరిగింది. ఓ మైనర్‌ బాలిక(11)పై అదే కాలనీకి చెందిన సాయి(26) అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికకు మాయమాటలు చెప్పి ఊరి చివరకు తీసుకెళ్లిన యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. తీవ్ర రక్త స్రావం కావడంతో బాలిక కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి ఆరా తీయగా... విషయం వెలుగుచూసింది. కాలనీ వాసులు యువకుడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. రూ.3కోట్ల విలువైన వజ్రాలు చోరీ

 



Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.