close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ - 9 AM

1. దిశ హత్య కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌

శంషాబాద్‌లో వెటర్నరీ వైద్యురాలు ‘దిశ’ హత్యోదంతానికి పోలీసులు ముగింపు పలికారు. కేసులో నిందితులుగా ఉన్న మహ్మద్‌ ఆరిఫ్‌ పాషా, జొల్లు శివ, నవీన్‌, చెన్న కేశవులను శుక్రవారం తెల్లవారుజామున ఎన్‌కౌంటర్‌ చేశారు. అయితే పోలీసులు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. దుమ్ముగూడెం వద్ద బ్యారేజి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం వద్ద 37 టీఎంసీల గోదావరి నీటిని నిల్వ చేసేందుకు కొత్త బ్యారేజి, 320 మెగావాట్ల జలవిద్యుత్‌ ఉత్పత్తి కోసం ప్లాంటు నిర్మించనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి మధ్యమానేరుకు మూడు టీఎంసీల నీటి ఎత్తిపోతలకు అవసరమైన ఏర్పాట్లు చేస్తామన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. సింగపూర్‌ కథలు చెప్పం

ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధిలో తాము సింగపూర్‌ కథలు చెప్పబోమని, ఒక పద్ధతి ప్రకారం ముందుకు సాగి మంచి ఫలితాలు చూపిస్తామని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. రాజధాని అమరావతిలోని తుళ్ళూరులో గురువారం తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆధ్వర్యంలో గురువారం రైతులు, కూలీలు, ప్రజాసంఘాల నాయకులతో రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. పేషీల ప్రక్షాళన

పేషీల్లో ఏళ్లుగా పాతుకుపోయిన అధికారులు, ఉద్యోగులు, వ్యక్తిగత సిబ్బందికి స్థాన చలనం కలిగించేలా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంత్రులు మొదలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జిల్లాల కలెక్టర్లు, ఎస్పీల వరకు వివిధ స్థాయుల్లోని అధికారుల పేషీల్లో... మూడేళ్లకు మించి ఎవరూ పనిచేయరాదని స్పష్టం చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ గురువారం రాత్రి బాగా పొద్దుపోయాక ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. వాహన కొనుగోలుదారు చెల్లించిన ధరకే పన్ను

వాహనాల జీవితకాల పన్ను వసూలు చిక్కుముడి వీడింది. వాహన విక్రయదారులు ఇచ్చే రాయితీల (డిస్కౌంట్‌)ను పన్ను నుంచి మినహాయించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇకపై వాహన విక్రయ షోరూమ్‌ జారీ చేసే బిల్లుల్లో పేర్కొన్న మొత్తాన్నే ప్రామాణికంగా తీసుకుని జీవిత కాల పన్ను (లైఫ్‌ ట్యాక్స్‌) వసులు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. సుమోటోగా ‘ఈనాడు’ కథనం

హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌తోపాటు ఇతర జిల్లాల్లోని ప్రభుత్వ వసతి గృహాల్లో నెలకొన్న దారుణ పరిస్థితులపై హైకోర్టు స్పందించింది. గత నెల 19న ‘ఈనాడు’ హైదరాబాద్‌ నగర  పత్రికలో ‘వసతి వణుకుతోంది’ శీర్షికతో ప్రచురితమైన కథనాన్ని హైకోర్టు సుమోటో ప్రజాప్రయోజన వ్యాజ్యంగా పరిగణనలోకి తీసుకుంది. పిటిషన్‌లో ప్రతివాదులుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాంఘిక, మహిళా శిశు సంక్షేమశాఖల ముఖ్యకార్యదర్శులు, అధికారుల, ఆయా జిల్లా కలెక్టర్లను పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. ‘సుప్రీం’ జడ్జి క్షమాపణ చెప్పిన వేళ..

కోర్టు ధిక్కార చర్యలు తీసుకుంటానంటూ ఒక సీనియర్‌ న్యాయవాదిని హెచ్చరించినందుకు సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అరుణ్‌ మిశ్ర విచారం వ్యక్తంచేశారు. తన వ్యాఖ్యలతో ఎవరైనా నొచ్చుకొని ఉంటే చేతులు జోడించి వంద సార్లు క్షమాపణ చెబుతానని గురువారం పేర్కొన్నారు. భూ సేకరణ అంశంపై మంగళవారం విచారణ జరుపుతున్నప్పుడు సీనియర్‌ న్యాయవాది గోపాల్‌ శంకరనారాయణన్‌ను ఉద్దేశించి జస్టిస్‌ మిశ్ర హెచ్చరిక చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. మహిళలకు అనుమతి.. తుది తీర్పు కాదు: సుప్రీంకోర్టు

శబరిమల ఆలయంలోకి మహిళలను అనుమతిస్తూ గత ఏడాది తాము వెలువరించినది తుదితీర్పు కాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఆ అంశాన్ని విస్తృత ధర్మాసనానికి అప్పగించిన సంగతిని గుర్తుచేసింది. శబరిమల ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన తనపై దాడి జరిగిందంటూ బిందు అమ్మిని అనే మహిళ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. పురుషుల వన్డేకు రిఫరీగా లక్ష్మి

తెలుగు మహిళ, మాజీ క్రికెటర్‌ జీఎస్‌ లక్ష్మి అరుదైన ఘనత సాధించనుంది. పురుషుల వన్డేకు మ్యాచ్‌ రిఫరీగా వ్యవహరించిన తొలి భారత మహిళగా ఆమె నిలవబోతోంది. ప్రపంచకప్‌ లీగ్‌-2 టోర్నీ మూడో సిరీస్‌లో భాగంగా యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, అమెరికా మధ్య ఆదివారం జరిగే తొలి వన్డేలో లక్ష్మి మ్యాచ్‌ అధికారిణిగా పని చేయనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. దిల్లీ:పార్లమెంట్‌ క్యాంటీన్‌లో ఎంపీలకు రాయితీ ఎత్తివేత


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.