close

తాజా వార్తలు

Published : 19/07/2020 22:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

భారతీయులపై నేపాల్‌ పోలీసుల కాల్పులు

భారత్‌-నేపాల్‌ సరిహద్దు వద్ద ఉద్రిక్తత

పట్నా: బిహార్‌లోని భారత్‌-నేపాల్‌ సరిహద్దు వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరు దేశాల సరిహద్దు ప్రాంతమైన కిషన్‌గంజ్‌ వద్ద ముగ్గురు భారతీయులపై నేపాల్‌ పోలీసులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ఒకరు గాయపడ్డారు. అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించినట్లు కిషన్‌గంజ్‌ ఎస్పీ తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు. భారత్‌లోని కాలాపానీ సహా పలు ప్రాంతాలను నేపాల్‌ తమవిగా చెప్పుకుంటున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో భారత్‌, నేపాల్‌ మధ్య వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో భారతీయులపై నేపాల్‌ పోలీసుల కాల్పుల ఘటన మరింత ఉద్రిక్త పరిస్థితులకు దారితీసే అవకాశాలున్నాయి. 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.