సీఎం జగన్‌కు నారా లోకేశ్‌ లేఖ
close

తాజా వార్తలు

Updated : 25/06/2020 11:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సీఎం జగన్‌కు నారా లోకేశ్‌ లేఖ

అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పటి నుంచి భవన నిర్మాణ కార్మికులకు వెతలు మెదలయ్యాయని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి  నారా లోకేశ్‌ విమర్శించారు. ఈమేరకు భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీ సీఎం జగన్‌కు లేఖరాశారు.  ఇసుక నూతన పాలసీ అంటూ నాలుగు నెలలు తాత్సారం చేసి ... సుమారు 60 మంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకునేలా చేశారని విమర్శించారు. 

కొత్తగా తీసుకొచ్చిన ఇసుక పాలసీతో రాష్ట్రంలోని అధికార పార్టీ నేతలకు సంబంధించిన ఇసుక మాఫియా కోట్లకు పడగలెత్తితే.. భవన నిర్మాణ రంగం కుప్పకూలిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా ఏ స్థాయిలో పేట్రేగిపోతోందో తాజాగా ఓ మంత్రికి ఇసుక బదులు మట్టిపంపించిన ఘటనే నిదర్శనమన్నారు. ఇదంతా స్టాక్‌ యార్డు ముసుగులో జరుగుతున్న దోపిడీ అని .. అధికారులు, వైకాపా నేతలే ఇందులో సూత్రధారులన్నది సుస్పష్టమని తెలిపారు. ఇసుక అక్రమాలను సహించబోమని ప్రకటించి మౌనంగా ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. కేరళ రాష్ట్రం వలస కూలీలకు సకల సదుపాయాలు కల్పించి అండగా నిలిచిందని గుర్తుచేశారు. కేంద్రం నిధులు మినహా కార్మికులకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని స్పష్టం చేశారు. కార్మిక సంఘాల నాయకులతో వెంటనే సంక్షేమ మండలి బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. కార్మికుల నుంచి వసూలు చేసిన సెస్‌ వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని లోకేశ్‌ డిమాండ్‌ చేశారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని