close

తాజా వార్తలు

Published : 24/02/2021 01:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

గిరిజనులపై కక్ష సాధింపు హేయం: కోమటిరెడ్డి

సీఎం కేసీఆర్‌కు లేఖ రాసిన కాంగ్రెస్‌ ఎంపీ

భువనగిరి: అడవి తల్లిని నమ్ముకున్న గిరిజనులకు పోడు భూములే ఆధారమని.. ఆ భూములు సాగుచేసుకుని జీవిస్తున్న వారిపై అధికారులు ఉక్కుపాదం మోపడం ఎంతవరకు సమంజసమని కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రశ్నించారు. ఈ మేరకు తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలోని ఖమ్మం, ఆదిలాబాద్‌, వరంగల్‌.. ఇలా అన్ని జిల్లాల్లోని తండాలు, గూడేలకు చెందిన గిరిజనులపై అక్రమ కేసులు నమోదు చేసి పంటలను సైతం ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు. ఏడు దశాబ్దాలుగా అడవినే నమ్ముకుని జీవనం సాగిస్తున్న గిరిజనులపై ప్రభుత్వం కక్ష సాధింపు హేయమైన చర్య అని ఆక్షేపించారు. అటవీపుత్రులకు అండగా ఉంటామన్న ప్రభుత్వం.. అడుగడుగునా ఇబ్బందులకు గురిచేస్తోందని లేఖలో కోమటిరెడ్డి ఆరోపించారు. 

‘‘అసెంబ్లీ సాక్షిగా పోడుభూములపై గిరిజన రైతులకు హక్కులు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తామని మీరు హామీ ఇచ్చారు. వారికి పట్టాలు ఇస్తామని.. అటవీ హక్కు చట్టాన్ని కాపాడతానని చెప్పి ఇప్పటివరకు ఆ హామీని నెరవేర్చలేదు. గిరిజనులకు అండగా ఉంటానన్న ప్రభుత్వమే వారిపై అక్రమ కేసులు పెడుతూ జైలుకు పంపిస్తోంది. ఇదేనా గిరిజనుల పట్ల మీరు ప్రవర్తించే తీరు? వారి సమస్యలపై కేంద్ర ప్రభుత్వంతో ఇంతవరకు ఎందుకు చర్చలు జరపలేదు?’’ అని కేసీఆర్‌ను కోమటిరెడ్డి ప్రశ్నించారు. ఈ సమస్యను పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రస్తావిస్తామని చెప్పారు. గిరిజనుల అక్రమ కేసులపై వెనక్కి తగ్గకపోతే ప్రభుత్వంపై కాంగ్రెస్‌ పార్టీ పోరాడుతుందన్నారు.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని