close

తాజా వార్తలు

Published : 02/05/2020 11:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

దిల్లీలో 122 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లకు కరోనా!

దిల్లీ: దిల్లీలో ఉన్న సీఆర్‌పీఎఫ్‌ 31వ బెటాలియన్‌లో ఇప్పటి వరకు 122 మందికి కరోనా వైరస్‌ సోకినట్లు అధికారులు వెల్లడించారు. మరో 100 మంది ఫలితాలు రావాల్సి ఉందని తెలిపారు. గత కొన్ని రోజులుగా మహమ్మారి విజృంభిస్తుండడంతో వారు ఉంటున్న మయూర్‌ విహార్‌ ఫేజ్‌-3 ప్రాంతాన్ని ఇప్పటికే పూర్తిగా నిర్బంధంలో ఉంచారు. పాజిటివ్‌ వచ్చిన వారిలో చాలా మందిలో ఎలాంటి లక్షణాలు లేవని అధికారులు పేర్కొన్నారు. వీరందరినీ మండోలిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. శుక్రవారం కొత్తగా 12 మందికి వైరస్‌ ఉన్నట్లు గుర్తించామన్నారు. ఈ వారం మొదట్లో 55 ఏళ్ల వయసున్న ఓ ఎస్‌ఐ కరోనా ధాటికి చనిపోయిన విషయం తెలిసిందే. సెలవులపై వెళ్లి వచ్చిన ఓ కానిస్టేబుల్‌ నుంచే బెటాలియన్‌లో మిగతా వారికి ఈ వైరస్‌ సోకి ఉంటుందని భావిస్తున్నారు. 

 

ఇవీ చదవండి..

భారత్‌లో 24 గంటల్లో 2,293 కేసులు


 


 

Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని