బండి సంజయ్‌కు శ్రీనివాస్‌గౌడ్‌ సవాల్‌
close

తాజా వార్తలు

Updated : 02/05/2021 14:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బండి సంజయ్‌కు శ్రీనివాస్‌గౌడ్‌ సవాల్‌

హైదరాబాద్‌: తెలంగాణ భాజపా నేతలు తనపై కక్షపూరితంగా బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని రాష్ట్ర అబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ విమర్శించారు. మహబూబ్‌నగర్‌లో భూమి కబ్జా చేశానంటూ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తనపై తప్పుడు ఆరోపణలు చేశారన్నారు. వాటిని రుజువు చేయాలని.. అలా చేస్తే అన్ని పదవులకు రాజీనామా చేస్తానన్నారు. లేదంటే ఎంపీ పదవికి బండి సంజయ్‌ రాజీనామా చేయాలని ఆయన సవాల్‌ విసిరారు. ఇప్పటికైనా నిరాధారమైన ఆరోపణలు చేయడం మానుకోవాలని శ్రీనివాస్‌గౌడ్‌ సూచించారు. 

మంత్రి ఈటల రాజేందర్‌పై భూకబ్జా ఆరోపణలు రావడం ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో భాజపా.. అధికార పార్టీ నాయకులపై కబ్జాల ఆరోపణలు చేసింది. ‘‘తెరాసకు చెందిన 77 మంది ఎమ్మెల్యేలపై ఆరోపణలు ఉన్నాయి. వారిపై వెంటనే యుద్ధ ప్రాతిపదికన విచారణ జరిపించాలి. తెరాస నేతల పూర్తి చిట్టాను బయటకు తీస్తున్నాం. ఒక్కొక్కటిగా బయట పెడతాం’’ అని బండి సంజయ్‌ ఇటీవల అన్న విషయం తెలిసిందే.Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని