అభ్యర్థులను రేపు ప్రకటిస్తాం: పువ్వాడ
close

తాజా వార్తలు

Published : 19/04/2021 14:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అభ్యర్థులను రేపు ప్రకటిస్తాం: పువ్వాడ

 

హైదరాబాద్‌: ఖమ్మం కార్పొరేషన్‌ మేయర్‌ పదవిపై తన సతీమణికి ఆసక్తి లేదని మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ స్పష్టం చేశారు. నామినేషన్ల గడువు ముగియడంతో ప్రచార హోరుకు ఆయన ఇవాళ శ్రీకారం చుట్టారు. తాను మంత్రిగా బాధ్యతలు చేపట్టాక రెండున్నరేళ్లలో ఖమ్మంలో జరిగిన అభివృద్ధిపై ఆయన కరపత్రం విడుదల చేశారు. విపక్షాలు ఆరోపణలు తప్ప అభివృద్ధి చేయలేవన్నారు. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. తాము సీపీఐతో కలిసి పోటీ చేస్తున్నామన్న మంత్రి.. అభ్యర్థులను రేపు ప్రకటిస్తామని తెలిపారు. 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని