close

తాజా వార్తలు

Published : 24/01/2021 01:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

దక్షిణాది నగరాలను పట్టించుకోండి: కేటీఆర్‌

హైదరాబాద్‌: దక్షిణాది నగరాలు అభివృద్ధిలో అగ్రగామిగా ఉన్నా.. అందుకు తగ్గట్లుగా కేంద్రం నుంచి ప్రోత్సాహం లభించడం లేదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ విమర్శించారు. హైదరాబాద్‌లోని రెడ్ హిల్స్‌లోని వాణిజ్య, పారిశ్రామిక మండలుల సమాఖ్య ఆధ్వర్యంలో ఇండస్ట్రీ ఎక్సలెన్స్ అవార్డుల కార్యక్రమానికి కేటీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు అవార్డులు అందజేశారు. రాష్ట్రం ఏర్పడక ముందు.. ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత తెలంగాణలో పారిశ్రామికీకరణ, శాంతిభద్రతల విషయంలో గుణాత్మక మార్పును తీసుకువచ్చామని కేటీఆర్ గుర్తు చేశారు. పలు విభాగాలకు చెందిన అభివృద్ధి సూచికల్లో దేశవ్యాప్తంగా చూస్తే తెలంగాణ మొదటి మూడు స్థానాల్లో నిలుస్తుందన్నారు. అభినందనలు తప్ప అందుకు తగ్గ నిధులు, ప్రాజెక్టులు రాష్ట్రానికి రావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హై స్పీడ్ రైళ్లు, పారిశ్రామిక కారిడార్లు వంటి పలు అభివృద్ధి ప్రాజెక్టులు, పథకాల లబ్ధిలో దక్షిణాది రాష్ట్రాలను సైతం  కేంద్రం భాగస్వాములను చేయాలని సూచించారు. కరోనా సంక్షోభంతో ఆర్థిక వ్యవస్థ పడిపోయిన కారణంగా అమలులో సాధ్యం కాలేదని.. గతంలో ఇచ్చిన హామీ మేరకు వచ్చే బడ్జెట్ నుంచి పరిశ్రమలకు మరిన్ని పారిశ్రామిక రాయితీలు ఇచ్చేలా విధానాలు తీసుకువస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు.

ఇవీ చదవండి..

మాజీ మంత్రి అఖిలప్రియ విడుదల

సీఎం ఇంటిని ముట్టడిస్తే అత్యాచారయత్నం కేసా?Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని