close

తాజా వార్తలు

Published : 27/07/2020 13:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కూల్చివేత ప్రాంతానికి మీడియా ప్రతినిధులు

హైదరాబాద్: తెలంగాణ సచివాలయ భవనాల కూల్చివేత, వ్యర్థాల తొలగింపు పనులకు సంబంధించిన వార్తల సేకరణకు అనుమతులు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే  ఈ సాయంత్రం నగర పోలీసు కమిషనర్‌ ఆధ్వర్యంలో మీడియా ప్రతినిధులకు సచివాలయ ప్రాంతాన్ని చూపనున్నట్లు రాష్ట్ర రహదారులు, భవణాల శాఖ మంత్రి ప్రశాంత్‌ రెడ్డి తెలిపారు. కూల్చివేత సంబంధిత వార్తలు సేకరించడానికి అనుమతి ఇవ్వాలన్న విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

అయితే, కూల్చివేతల సందర్భంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని.. తగు జాగ్రత్తలు తీసుకుని ప్రభుత్వమే మీడియా ప్రతినిధులకు ఆ ప్రాంతాన్ని చూపించాలని నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు. ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు బీఆర్కే భవన్‌ నుంచి మీడియా ప్రతినిధులను నగర పోలీసు కమిషనర్‌ ఆధ్వర్యంలో తీసుకెళ్లి సెక్రటేరియట్‌ ప్రాంతాన్ని చూపించనున్నట్లు మంత్రి ప్రశాంత్‌ రెడ్డి వివరించారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.