close

తాజా వార్తలు

Published : 07/07/2020 04:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నాలుగు నెలల విద్యుత్తు బిల్లు రూ.25 లక్షలు

సాంకేతిక తప్పిదం అంటూ సరి చేసిన అధికారులు 

హైదరాబాద్‌:  రూ. 25,11,467... ఇది ఆస్తి లెక్క కాదు. ఓ సాధారణ కుటుంబానికి వచ్చిన కరెంటు బిల్లు లెక్క. ప్రతి నెలా ఐదారొందలు బిల్లు కట్టే ఇంటికి ఇంత బిల్లు వచ్చేసరికి ఆ ఇంటి యజమాని అదేదో సర్ఫ్‌ యాడ్‌లోలా అవాక్కయ్యాడు. ఇంతకీ ఏమైందంటే...  తార్నాక డివిజన్ లాలాపేట పరిధిలోని జనప్రియ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న కృష్ణమూర్తి అనే వినియోగదారుని ఇంట్లో మార్చి 6 నుంచి జూలై 6 వరకు కరెంట్‌ బిల్లు తీశారు. ఈ నాలుగు నెలల కాలంలో 3,45,007 యూనిట్ల విద్యుత్‌ను వాడినట్లు చూపించి ఏకంగా రూ. 25,11, 467 విద్యుత్ బిల్లు రశీదు ఇచ్చారు. దీంతో వినియోగదారుని కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. సాధారణంగా ప్రతి నెల రూ.500 నుంచి రూ.600 మాత్రమే వస్తుందని విద్యుత్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన అధికారులు విద్యుత్ మీటర్‌ను పరీక్షించి సాంకేతిక కారణాల వల్ల బిల్లు ఇలా వచ్చిందని పేర్కొన్నారు. బిల్లును రూ.2,095కు సరి చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని