
తాజా వార్తలు
గూగుల్ ప్లేస్టోర్‌లో 200రుణ యాప్‌ల తొలగింపు
హైదరాబాద్: రుణ యాప్‌ల వ్యవహారంలో గూగుల్ ప్లేస్టోర్ నుంచి సుమారు 200 యాప్‌లను తొలగించారు. రుణగ్రహీతలను వేధిస్తున్న సంస్థలకు చెందిన యాప్‌లను ప్లేస్టోర్ నుంచి తొలగించాలని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసులు ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్‌కు లేఖ రాశారు. లేఖపై స్పందిస్తూ ఆయా యాప్‌లను ప్లేస్టోర్ నుంచి గూగుల్ తొలగించింది. మరిన్ని యాప్‌లను తొలగించాలని పోలీసు అధికారులు సంస్థకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు యాప్ నిర్వాహకుల వేధింపుల బారినపడిన వారు డయిల్ 100, లేదా సమీప పోలీసుస్టేషన్లలో ఫిర్యాదు చేయాలని పోలీసులు తెలిపారు. ఎవరూ బలవన్మరణాలకు పాల్పడవద్దని పోలీసు ఉన్నతాధికారులు సూచిస్తున్నారు.
ఇవీ చదవండి..
ఎవరూ అనారోగ్యానికి గురికాలేదు: కేంద్రం
‘ఉప్మాపాప’కు థాంక్స్ చెప్పిన రామ్..
Tags :