
తాజా వార్తలు
కర్నూలు విమానాశ్రయానికి డీజీసీఏ అనుమతి
ఓర్వకల్లు: ఆంధ్రప్రదేశ్లో నూతనంగా నిర్మించిన కర్నూలు విమానాశ్రయంలో విమాన రాకపోకలకు డైరెర్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అనుమతి లభించింది. ఈ మేరకు మార్చి నుంచి విమానాల రాకపోకలు, కార్యకలాపాలకు ఏరోడ్రోమ్ లైసెన్స్ జారీ చేసినట్లు కర్నూలు విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. విమానాశ్రయ పనులు వేగవంతం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గత ఏడాది మార్చిలో ఆదేశించారు. ఈ నేపథ్యంలో త్వరితగతిన పనులు పూర్తి చేసి సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. పనులు పూర్తయిన అనంతరం ఇటీవల దిల్లీ నుంచి డీజీసీఏ అధికారుల బృందం విమానాశ్రయంలోని మౌలిక వసతులు, ఇతరత్రా అంశాలను పరిశీలించి వెళ్లారు. విమానాశ్రయంలో అన్నిరకాల సౌకర్యాలు అందుబాటులోకి రావడంతో డీజీసీఏ అనుమతి లభించినట్లు అధికారులు తెలిపారు.
ఇవీ చదవండి..
టీకా వేయించుకున్న తొలి పొలిటీషియన్లు వీరే..!