close

తాజా వార్తలు

Published : 25/01/2021 01:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

యాదాద్రి.. కేసీఆర్‌ కలల ప్రాజెక్టు: కేటీఆర్‌

ట్విటర్‌లో వీడియో పంచుకున్న మంత్రి

హైదరాబాద్‌: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని ప్రపంచస్థాయిలో పునరుద్ధరించారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఆలయానికి సంబంధించిన వీడియోను కేటీఆర్ తన ట్విట్టర్‌ ద్వారా పంచుకున్నారు. యాదాద్రి ఆలయం సీఎం కేసీఆర్ కలల ప్రాజెక్టు అని కేటీఆర్ తెలిపారు. ప్రతిష్ఠాత్మక కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులను చేపట్టిన కేసీఆర్.. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని ఎంతో పట్టుదలతో పూర్తి చేసేలా చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక నగరిగా యాదాద్రిని తీర్చిదిద్దుతున్నట్లు కేటీఆర్‌ చెప్పారు.

ఇవీ చదవండి..

ఏపీ ప్రభుత్వం పిటిషన్: విచారణ బెంచ్‌ మార్పు

కేటీఆర్‌ మెచ్చిన ఈ కుర్రాడి టాలెంట్‌ చూశారా..?




Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని