
తాజా వార్తలు
రెచ్చగొట్టే పార్టీలకు బుద్ది చెప్పాలి: కేటీఆర్
సిరిసిల్ల: కులం, మతం పేరుతో రెచ్చగొట్టే పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పాలని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రమైన సిరిసిల్లలోని పద్మనాయక కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ...ఈ నెలాఖరులోపు సభ్యత్వ నమోదు పూర్తి చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. పుట్టుక నుంచి చావు వరకు ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూరుతుందన్నారు. రైతుకు పెట్టుబడి ఇవ్వాలని ఇన్నేళ్లలో ఏ ప్రభుత్వమైనా ఆలోచించిందా అని ప్రశ్నించారు. పార్టీలకతీతంగా కల్యాణలక్ష్మి, రైతు బంధు అందుతోందని గుర్తు చేశారు. తెలంగాణలో మాదిరిగా ఇతర రాష్ట్రాల్లో 24 గంటల ఉచిత విద్యుత్ ఉందా అని కేటీఆర్ నిలదీశారు.
ఇవీ చదవండి..
ఆజాద్ స్థానంలో ఖర్గే
కేంద్రం, ట్విటర్‌కు సుప్రీం నోటీసులు
Tags :