‘కేసీఆర్‌ వ్యతిరేక ఉద్యమానికి సిద్ధం’
close

తాజా వార్తలు

Updated : 01/05/2021 17:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘కేసీఆర్‌ వ్యతిరేక ఉద్యమానికి సిద్ధం’

తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్‌

హైదరాబాద్‌: తెలంగాణ సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఉద్యమం నిర్మించడానికి సిద్ధమని తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షుడు కోదండరామ్‌ అన్నారు. నాంపల్లిలోని ఆ పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈటలతో పాటు కేటీఆర్‌, మల్లారెడ్డి, ముత్తిరెడ్డి, మంచిరెడ్డి, మహిపాల్‌రెడ్డిపై విచారణ జరపాలి. ఈటల గట్టిగా మాట్లాడినందుకే ఆయనపై విచారణ జరుగుతోంది. ప్రత్యర్థులను లొంగదీసుకోవడానికి భూ వివాదాలు సృష్టిస్తున్నారు. హఫీజ్‌పేట్‌, మియాపూర్‌ భూములపై కూడా విచారణ జరపాలి. కరోనా నుంచి దృష్టి మరల్చడానికే ఈటల వ్యవహారం. భూ రికార్డుల ప్రక్షాళనలో ప్రభుత్వం విఫలమైంది’’ అని అన్నారు.Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని