పాపను బలిగొన్న ఫేస్‌బుక్‌ పరిచయం
close

తాజా వార్తలు

Updated : 03/07/2020 07:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పాపను బలిగొన్న ఫేస్‌బుక్‌ పరిచయం

 

తన మిత్రుడితో చనువుగా ఉంటోందని వివాహితపై ఆగ్రహం
ఆమె కుమార్తె గొంతు కోసిన యువకుడు

ఈనాడు, హైదరాబాద్‌- న్యూస్‌టుడే, ఘట్‌కేసర్‌: తల్లి ఫేస్‌బుక్‌ పరిచయం కుమార్తెను బలితీసుకుంది. ఆమె ఫేస్‌బుక్‌ మిత్రుడే చిన్నారిని అంతమొందించాడు. తనకు పరిచయమైన వివాహిత మిత్రుడితో సన్నిహితంగా ఉంటోందంటూ ఓ యువకుడు ఉన్మాదానికి పాల్పడ్డాడు. అదే కత్తితో తన గొంతు, చేతులను కోసుకున్నాడు. గురువారం హైదరాబాద్‌ శివారు ఘట్‌కేసర్‌ పోలీస్‌ఠాణా పరిధి ఇస్మాయిల్‌ఖాన్‌ గూడలో ఈ దారుణం జరిగింది. ఘట్‌కేసర్‌ ఇన్‌స్పెక్టర్‌ రఘువీర్‌రెడ్డి కథనం ప్రకారం వివరాలు.. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన వ్యక్తి, అనంతపురం జిల్లాకు చెందిన యువతి తొమ్మిదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. వీరికి ఐదేళ్ల పాప ఉంది. నాలుగు నెలల క్రితం సికింద్రాబాద్‌లోని భవానీనగర్‌లో ఉంటున్న కరుణాకర్‌ ఫేస్‌బుక్‌లో ఈ వివాహితకు పరిచయమయ్యాడు. ఇద్దరూ సన్నిహితంగా మెలిగారు. ఇదే క్రమంలో కరుణాకర్‌ తన స్నేహితుడు రాజశేఖర్‌ను కూడా ఆమెకు పరిచయం చేశాడు. ఈ క్రమంలో కొద్దిరోజులుగా వివాహిత కరుణాకర్‌తో మాట్లాడటం మానేసింది. తన ఇంటికి రావొద్దని చెప్పింది. రాజశేఖర్‌తో సన్నిహితంగా ఉంటున్నందుకే... ఆమె తనను దూరం పెట్టిందని కరుణాకర్‌ భావించి.. ఇద్దరినీ చంపేయాలని నిశ్చయించుకున్నాడు. గురువారం  సర్జికల్‌ కత్తిని తీసుకొని వివాహిత ఇంటికి వెళ్లాడు. ఆమె ఇల్లు తలుపువేసి ఉంది. రాజËశేఖర్‌ లోపల ఉండటంతో బయటకు రమ్మన్నాడు. అతను ఎంతకూ బయటకు రాకపోవడంతో బయట ఉన్న వివాహిత కుమార్తెను పట్టుకుని చంపుతానని కరుణాకర్‌ హెచ్చరించాడు. వివాహిత ప్రాధేయపడినా వినకుండా కత్తితో చిన్నారి గొంతు కోశాడు. వెంటనే బిడ్డ బిగ్గరగా అరవడంతో వివాహిత షాక్‌తో పడిపోయింది. ఈ అరుపులకు బయటకు వచ్చిన రాజశేఖర్‌పై కత్తితో దాడి చేశాడు. వెంటనే తన రెండు చేతులను, గొంతు కోసుకున్నాడు. స్థానికులు గాయపడ్డ చిన్నారి, రాజశేఖర్‌, కరుణాకర్‌లతో పాటు వివాహితను ఈసీఐఎల్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే చిన్నారి చనిపోయిందని వైద్యులు చెప్పారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చిన్నారి హత్యకు గల కారణాలను తెలుసుకుంటున్నామని మల్కాజిగిరి డీసీపీ రక్షితామూర్తి వివరించారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని