AP News: గూగుల్‌ చెప్పిన ఆచూకీ
close

తాజా వార్తలు

Updated : 11/06/2021 08:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

AP News: గూగుల్‌ చెప్పిన ఆచూకీ

అయిదేళ్లకు ఇంటికి చేరనున్న యువతి

గుమ్మలక్ష్మీపురం, న్యూస్‌టుడే: ఇంటి నుంచి వెళ్లిన అమ్మాయి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు తల్లడిల్లిపోయారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో అయిదేళ్లుగా బాధను అనుభవిస్తున్నారు. ఎట్టకేలకు ఆమె ఆచూకీ తెలియడంతో కుటుంబసభ్యుల సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. ఏపీలోని విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం టిక్కబాయి గ్రామానికి చెందిన పువ్వల జయసుధ మానసిక పరిస్థితి సరిగా లేక 2016లో ఇంటినుంచి బయలుదేరి రైలులో పుదుచ్చేరి చేరుకుంది. రైల్వేస్టేషన్‌లో ఉన్న ఆమెను కొందరు ఓ ఆశ్రమంలో చేర్పించారు. అక్కడ తనది లక్ష్మీపురం అని మాత్రమే చెప్పింది. మిగతా వివరాలేమీ చెప్పలేదు. ఇటీవల ఆమె మానసిక స్థితి మెరుగై గుమ్మలక్ష్మీపురం, కురుపాం, చినమేరంగి తదితర గ్రామాల పేర్లు చెప్పింది. గూగుల్‌ మ్యాప్‌లో వెతికి.. కురుపాంలోని ఓ సెల్‌ఫోన్‌ దుకాణ యజమానిని సంప్రదించి జయసుధ వివరాలు తెలిపారు. ఆమెను ఇంటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఎస్‌ఐ కృష్ణప్రసాద్‌ తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని