Vaccine: టీకాకు 98 శాతం జై!
close

తాజా వార్తలు

Updated : 11/06/2021 08:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Vaccine: టీకాకు 98 శాతం జై!

‘మైగేట్‌’ సర్వేలో వెల్లడి

పెబెల్‌ సొసైటీలో వివరాల సేకరణ

ఈనాడు, హైదరాబాద్‌: ఎటుచూసినా కొవిడ్‌ టీకాపై ఆసక్తి పెరుగుతోంది. సామాన్యుల నుంచి సంపన్నుల వరకూ కరోనాను ఎదుర్కొనేందుకు టీకాయే ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు. గతంలో దీనిపై ఉన్న అపోహలు, అనుమానాలు క్రమంగా తగ్గుతున్నాయి. టీకా వేయించుకునేందుకు గంటల తరబడి వరుసలో నిలబడుతున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లోని గేటెడ్‌ కమ్యూనిటీస్‌ల్లో చాలా మార్పు వచ్చినట్టు సాంకేతిక సంస్థ ‘మైగేట్‌’ సర్వేలో గుర్తించారు. హైదరాబాద్‌, దిల్లీ తదితర ముఖ్య నగరాల్లో గేటెడ్‌ కమ్యూనిటీ కుటుంబాలపై సర్వే నిర్వహించారు. కొవిడ్‌ టీకాపై వారి అభిప్రాయం, ఆసక్తిని సేకరించారు.
కొవాగ్జిన్‌.. కొవిషీల్డ్‌కే ప్రాధాన్యం
గేటెడ్‌ కమ్యూనిటీస్‌ కుటుంబాల్లోని 11,000 మంది ఈ సర్వేలో పాల్గొన్నారు. వీరిలో 98 శాతం మంది కొవిడ్‌పై యుద్ధానికి టీకాయే ఉత్తమమంటూ పేర్కొన్నారు. సంక్షేమ సంఘాలు, వైద్యసిబ్బంది ఆధ్వర్యంలో తమ కుటుంబాలకు టీకా అందిస్తున్నట్టు చెప్పారు. 50 శాతం మంది కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ తీసుకున్నట్టు స్పందించారు. 25 శాతం మంది స్పుత్నిక్‌ టీకాపై సానుకూలంగా స్పందించారు. సగటున ప్రతి ఇంట్లో 2.8 టీకాలు అవసరమవుతున్నట్టు పేర్కొన్నారు. కొవిడ్‌ రెండోదశ తీవ్రత సమాజంలో చాలా మార్పు తెచ్చింది. ఆరోగ్యస్పృహ మరింత అప్రమత్తంగా ఉండేలా మార్చేసింది. నివాస ప్రాంతంలోనే టీకా పొందేందుకు వీలుగా సురక్షిత ఏర్పాట్లు చేస్తున్నారు. బ్యాడ్మింటన్‌ కోర్టు, క్లబ్‌హౌస్‌, వ్యాయామ కేంద్రాలను టీకా వేసేందుకు అనువైన ప్రాంతాలుగా మలచుకుంటున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని