AP News: పెళ్లిరోజు నాడే భార్య హత్య
close

తాజా వార్తలు

Updated : 11/06/2021 08:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

AP News: పెళ్లిరోజు నాడే భార్య హత్య

హత్యకు గురైన లక్ష్మి

విస్సన్నపేట, న్యూస్‌టుడే: కృష్ణా జిల్లా విస్సన్నపేట మండలంలో వివాహితను భర్త దారుణంగా హత్య చేసిన సంఘటన గురువారం తెల్లవారుజామున వెలుగుచూసింది. విస్సన్నపేట పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని చండ్రుపట్ల తండా పంచాయతీ కొర్ర తండా గ్రామానికి చెందిన కొర్ర దుర్గారావు, ఇదే గ్రామానికి చెందిన లక్ష్మి(24)ని ప్రేమించి, పెద్దల అనుమతితో గత ఏడాది పెళ్లి చేసుకున్నాడు. వివాహమైన కొద్దికాలానికే దంపతుల మధ్య అభిప్రాయభేదాలు రావటంతో ఇద్దరి నడుమ తరచూ వివాదాలు జరిగినట్లు గ్రామస్థులు, కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో బుధవారం పెళ్లిరోజు సందర్భంగా ఇంట్లో వేడుక జరుపుకొన్నారు. అదేరోజు రాత్రి వారి మధ్య మరోమారు వివాదం తలెత్తి, ఘర్షణకు దారి తీసింది. ఈ ఘర్షణలో దుర్గారావు కొట్టిన దెబ్బలకు లక్ష్మి హఠాన్మరణం చెందగా, నిందితుడు విస్సన్నపేట పోలీసుల వద్దకు వచ్చి జరిగిన సంఘటన వివరించాడు. అతనిపై హత్య కేసు నమోదు చేశామని, తిరువూరు సీఐ ఎం.శేఖర్‌బాబు దర్యాప్తు ప్రారంభించారని విస్సన్నపేట ఎస్సై పి.కిశోర్‌ తెలిపారు. మృతదేహాన్ని తిరువూరు ప్రాంతీయ వైద్యశాలకు శవపరీక్ష నిమిత్తం తరలించినట్లు చెప్పారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని