
తాజా వార్తలు
నగరంలో కరోనా టీకాలు వేసే ఆసుపత్రులివే..
ఈనాడు, హైదరాబాద్; కీసర,నాంపల్లి, న్యూస్‌టుడే: అరవై ఏళ్లు పైబడిన, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 45-59 ఏళ్ల వయసున్న వారికి మార్చి 1 నుంచి కొవిడ్ టీకా ఇవ్వనున్నట్లు హైదరాబాద్ కలెక్టర్ శ్వేతామహంతి తెలిపారు. ఇందుకు ఎంబీబీఎస్ లేదా రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ నుంచి పొందిన ధ్రువపత్రం సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. టీకాకు ఏర్పాట్లు, రెండో దశ వ్యాక్సినేషన్ ప్రక్రియపై హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లా స్థాయిల టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశాలు ఆదివారం వేర్వేరు చోట్ల నిర్వహించారు. హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల సమావేశంలో కలెక్టర్ శ్వేతామహంతి మాట్లాడుతూ.. హైదరాబాద్ జిల్లాలో 12 ప్రభుత్వ, 12 ప్రైవేట్ ఆసుపత్రుల్లో వ్యాక్సిన్ ఇస్తారని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిమని, ప్రైవేట్ ఆసుపత్రుల్లో వ్యాక్సిన్‌కు రూ.150 సర్వీస్ఛార్జి కింద రూ.100 చెల్లించాలి.
ప్రభుత్వ వైద్యశాలలు
గాంధీ, ఉస్మానియా, ఫీవర్, ఈఎన్టీ ఆసుపత్రులు, ఎస్.డి.ఐ. ఆసుపత్రి, డీహెచ్ కింగ్ కోఠి ఆసుపత్రి, ఏహెచ్ మలక్‌పేట్, ఏహెచ్ గోల్కొండ, ఏహెచ్ నాంపల్లి, పాల్దార్ యూపీహెచ్సీ, నిజామియా టిబ్బీ ఆసుపత్రి, ఈఎస్ఐసీ మెడికల్ కాలేజ్, వనస్థలిపురం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి, కొండాపూర్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి.
ప్రైవేట్‌లో ఎక్కడెక్కడంటే..
బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి. అపోలో ఆసుపత్రి ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్- జూబ్లీహిల్స్, అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్, యశోద ఆసుపత్రి- సికింద్రాబాద్, ప్రిన్సిస్ ఎరా ఆసుపత్రి (డీసీఎంఎస్), యశోద ఆసుపత్రి- సోమాజిగూడ, మెడికవర్ ఆసుపత్రి ఏ యూనిట్ ఆఫ్ సహృదయ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్- సెక్రెటేరియట్, ప్రతిమ ఆసుపత్రి ఏ యూనిట్ ఆఫ్ శ్రీసాయి బాలాజీ హెల్త్ కేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, కేర్ ఆసుపత్రి- నాంపల్లి, సెంచరీ ఆసుపత్రి, కృష్ణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ లిమిటెడ్, కేర్ ఆసుపత్రి-బంజారాహిల్స్, మొయినాబాద్(అజీజ్‌నగర్) భాస్కర్ జనరల్ ఆసుపత్రి, హయత్‌నగర్‌లోని బ్రిసిల్కాన్ ఆసుపత్రి, కాంటినెంటల్, కామినేని ఆసుపత్రి.