close

తాజా వార్తలు

Updated : 24/01/2021 13:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌కు కొత్త హంగులు

సలహాలు అడిగిన మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌: భాగ్యనగరానికి మణిహారంగా ఉన్న ట్యాంక్‌బండ్‌.. పరిసర ప్రాంతాల్లో సుందరీకరణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. సాయంకాల సమయాల్లో, సెలవు దినాల్లో కుటుంబ సభ్యులతో ఆహ్లాదంగా గడిపే విధంగా చూడచక్కనైన దీపాల వరుసలు, పాదాచారుల మార్గాలను అధికారులు సౌకర్యవంతంగా తీర్చిదిద్దుతున్నారు. సాధ్యమైనంత త్వరగా వీటిని నగర ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని హెచ్ఎండీఏ ప్రయత్నిస్తోంది. కొంగొత్త హంగులతో రూపుదిద్దుకుంటున్న ట్యాంక్‌బండ్‌ ఫొటోలను పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. అభివృద్ధి పనుల్లో భాగంగా సలహాలు, సూచనలు అందజేయాలని నగర వాసులను ఆయన కోరారు. 

ట్యాంక్‌బండ్‌.. నగరానికి చేరువనే ఉన్న పర్యటక ప్రదేశం కావడంతో జంట నగరాల ప్రజలు ఇక్కడికొచ్చి సేద తీరుతుంటారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ హయాంలో దీనికి పర్యాటక హంగులు తీసుకొచ్చారు. వాటర్‌  ఫౌంటెయిన్లు, విద్యుద్దీపాలు అమర్చారు. ఈ మార్గంలో మహానీయుల విగ్రహాలను ఏర్పాటు చేశారు. వినాయక నిమజ్జనాల సమయంలో భారీ క్రేన్లు, పెద్ద సంఖ్యలో వాహనాలు ట్యాంక్ బండ్ పైకి వస్తుండటంతో కాలిబాటలు పూర్తిగా దెబ్బతిని ప్రమాదకరంగా మారాయి. ఈ తరుణంలో ట్యాంక్‌బండ్‌కు సొబగులు అద్దేందుకు హెచ్‌ఎండీఏ నిర్ణయించింది. అందులో భాగంగా హుస్సెన్ సాగర్ చుట్టూ ఉన్న ఫుట్‌పాత్‌లతో పాటు ఇతర అభివృద్ధి పనులనూ చేస్తోంది. దీనికి సంబంధించిన నిర్మాణాలు యుద్ధ ప్రాతిపాదికన సాగుతున్నాయి.

సైక్లింగ్‌ ట్రాక్‌లు.. నడకదారులు 

 సందర్శకులు సేద తీరేలా పెవిలియన్స్‌, బెంచీలతో పాటు సైక్లింగ్‌ ట్రాక్‌లను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. రంగు రంగుల పూలు, అలంకరణ మొక్కలను ట్యాంక్‌బండ్‌ పరిసరాల్లో నాటుతున్నారు. సాగర్‌ చుట్టూ 360 డిగ్రీల కోణంలో నెక్లెస్‌రోడ్డు మీదుగా నడక దారినీ అభివృద్ధి చేస్తున్నారు. ఫుట్‌పాత్‌పై గ్రానైట్, ఇనుముతో చేసిన రెయిలింగ్‌, గ్రిల్స్, డిజైనర్ విద్యుత్ దీపాలను అమర్చుతున్నారు. పనులు శరవేగంగా సాగుతున్నాయని... మరికొద్ది రోజుల్లో పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

ఇవీ చదవండి..
పాలమూరు-రంగారెడ్డి ఈ ఏడాదే పూర్తి

నిజాంసాగర్‌కు కొండపోచమ్మ నీరు!
Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
జాతీయ- అంతర్జాతీయ
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్