close

తాజా వార్తలు

Published : 24/01/2021 08:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రామతీర్థానికి రాములోచ్చారు

ఆలయానికి కొత్త విగ్రహాల రాక ●

28న బాలాలయంలో ప్రతిష్ఠాపన

దేవస్థానం వద్ద పీఠంపై ఉంచిన సీతారామలక్ష్మణుల విగ్రహాలు

నెల్లిమర్ల, న్యూస్‌టుడే: జై శ్రీరామ్‌.. జైజై శ్రీరామ్‌ అనే నినాదాలతో రామతీర్థం మార్మోగింది. తితిదే ఆధ్వర్యంలో కృష్ణ శిలతో తయారు చేసిన సీతారామ, లక్ష్మణుల విగ్రహాలను ప్రత్యేక వాహనంలో శనివారం మధ్యాహ్నం తీసుకొచ్చారు. కుమిలి రహదారి నుంచి పోలీసు బందోబస్తు నడుమ రామతీర్థం ఉన్నత పాఠశాల కూడలికి చేరుకున్న విగ్రహాలకు దేవాదాయ శాఖ ఆర్జేసీ భ్రమరాంబ పూజలు చేశారు. అనంతరం మంగళవాయిద్యాలతో దేవస్థానం ముఖద్వారం వరకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. దేవస్థానంలో ధ్వజస్తంభం వద్ద విగ్రహాలను పీఠంపై నిలిపి శాస్త్రోక్తంగా అర్చకులు పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు, పోలీసుల సహకారంతో విగ్రహాలను, పీఠాన్ని యాగశాల ఎదురుగా ఉన్న గదిలోకి తరలించి భద్రపరిచారు. ఆర్జేసీ భ్రమరాంబ మాట్లాడుతూ ప్రధాన దేవాలయంలో సీతారామలక్ష్మణుల నూతన విగ్రహాలకు ఈ నెల 25 నుంచి అంకురార్పణ పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు.26, 27వ తేదీల్లో యాగశాలలో ప్రాయశ్చిత్త హోమాలు జరుగుతాయన్నారు. 28న కల్యాణ మండపం వద్ద బాలాలయం ఏర్పాటు చేసి అందులో విగ్రహాలను ప్రతిష్ఠించి, నిత్యపూజలు నిర్వహిస్తారని చెప్పారు. నీలాచలం కొండపై కోదండరాముని ఆలయ పునర్నిర్మాణం పూర్తయ్యాక, అక్కడికి విగ్రహాలను తరలించి ప్రతిష్ఠాపన నిర్వహించనున్నట్లు వివరించారు. డిప్యూటీ కమిషనరు ఎన్‌.సుజాత, రామతీర్థం, పైడితల్లి ఆలయాల ఈవోలు రంగారావు, సుబ్రహ్మణ్యం, ప్రధానార్చకులు సాయిరామాచార్యులు, స్థానాచార్యులు నరసింహాచార్యులు, కిరణ్‌కుమార్‌, పవన్‌కుమార్‌పాల్గొన్నారు.విజయనగరం గ్రామీణ సీఐ టి.సత్యమంగవేణి ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

ఆలయాన్ని పునర్నిర్మిస్తాం: మంత్రి

తిరుమల, న్యూస్‌టుడే: రామతీర్థంలో కోదండరాముని ఆలయాన్ని పునర్నిర్మించి అందులో కొత్తగా తయారు చేసిన సీతారామ లక్ష్మణుల విగ్రహాలను ప్రతిష్ఠిస్తామని దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. శనివారం ఉదయం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయన మాట్లాడుతూ నీలాచలంపై ఆలయ పునర్నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని చెప్పారు.

ఊరేగింపుగా తీసుకొస్తున్న అధికారులు, భక్తులు

రామతీర్థం దేవస్థానంలోకి విగ్రహాలను తరలిస్తున్న భక్తులు, దేవాలయ సిబ్బంది



Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని