close

తాజా వార్తలు

Updated : 24/01/2021 08:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

గోల్డెన్‌ టెంపుల్‌లో వెండి వినాయకుడు

వినాయకుడి ఆలయం

వేలూర్‌ : వేలూర్‌ సమీపం శ్రీపురం గోల్డెన్‌ టెంపుల్‌లో శక్తి అమ్మ శుక్రవారం రాత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.... శ్రీపురంలో 2000లో నారాయణి ఆలయం, 2007లో గోల్డెన్‌ టెంపుల్‌ నిర్మించారన్నారు. అదేవిధంగా శ్రీనివాస పెరుమాళ్‌కి ప్రత్యేక సన్నిధిని ఏర్పాటుచేశారని, భక్తుల కోరిక మేరకు ఆలయ ప్రాంగణంలో వినాయకుడికి ఆలయం నిర్మించడానికి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆ మేరకు 700 టన్నుల రాయితో గోల్డెన్‌ టెంపుల్‌ ప్రాంగణంలో శ్రీశక్తి గణపతి ఆలయం ఏర్పాటు చేశారని, ఈ ఆలయంలో ఉంచే వినాయకుడి విగ్రహాన్ని 5 అడుగుల ఎత్తులో 1,700 కిలోల వెండితో తయారు చేశారన్నారు. ఈ ఆలయంలో మహాకుంభాభిషేకం రానున్న 25వ తేదీ జరగనుందని, ఈ సందర్భంగా గతనెల 15వ తేదీ నుంచి ఈనెల 25వ తేదీ వరకు నవధాన్యాలతో చేసిన లక్షా 8 వేల లడ్డులతో యాగం, ప్రత్యేక పూజలు చేస్తున్నట్లు తెలిపారు.

వెండి విగ్రహంTags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని