close

తాజా వార్తలు

Published : 05/12/2020 08:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

లెక్కింపునకు పిలిచి.. ఇంటికి వెళ్లమన్నారు

వివాదాస్పదమైన జీహెచ్‌ఎంసీ ఎన్నికల విభాగం తీరు

ఈనాడు, హైదరాబాద్‌: గ్రేటర్‌ ఎన్నికల లెక్కింపు ప్రక్రియ ప్రారంభంలో గందరగోళానికి తావిచ్చింది. ఓట్లను లెక్కించేందుకు ముందస్తుగా శిక్షణ ఇచ్చి సమకూర్చుకున్న పలువురు ఉద్యోగులను శుక్రవారం ఉదయం లెక్కింపు కేంద్రాల వద్ద లోపలికి అనుమతించలేదు. వీరిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతోపాటు రాష్ట్ర సర్కారు ఉద్యోగులూ ఉన్నారు. వడు రోజుల ముందే వారందరికీ లెక్కింపు ప్రక్రియపై బల్దియా శిక్షణ ఇచ్చింది. అనంతరం పైస్థాయి నుంచి వచ్చిన ఆదేశాల మేరకు జీహెచ్‌ఎంసీ ఎన్నికల అథారిటీ డి.ఎస్‌.లోకేష్‌కుమార్‌ జీహెచ్‌ఎంసీ ఉద్యోగులనూ లెక్కింపునకు ఉపయోగించాలని అన్నివిభాగాల అధిపతులకు సందేశం పంపారు. ఆమేరకు ఉన్నతాధికారులు గురువారం సాయంత్రం సుమారు వెయ్యి మంది బల్దియా ఉద్యోగులను బస్సుల్లో ఎక్కించి లెక్కింపు కేంద్రాలకు తీసుకెళ్లారు. అప్పటికప్పుడు లెక్కింపు సహాయకుల విధులు, పర్యవేక్షకుల విధులు ఎలా నిర్వర్తించాలో తెలియజేసి తిరిగి కేంద్ర కార్యాలయంలో దింపారు. వీరితో కలిపితే ఎన్నికల విధులకు ఎంపిక చేసిన మొత్తం ఉద్యోగుల సంఖ్య 8,152కి పెరిగింది. వారంతా శుక్రవారం ఉదయం 5గంటలకే లెక్కింపు కేంద్రాలకు చేరుకున్నారు. 6 గంటల నుంచి స్ట్రాంగ్‌రూముల తలుపులు తెరవడం, బ్యాలెట్‌ పెట్టెలను లెక్కింపు కేంద్రాలకు తీసుకెళ్లే పనులు మొదలయ్యాయి. ఈ క్రమంలో ఉద్యోగులకు విధుల కేటాయింపులు వివాదాస్పదమయ్యాయి. నిజాం కళాశాల మైదానంలోని మల్టీపర్సస్‌ భవనంలో ఉన్న లెక్కింపు కేంద్రాల్లో విధులు నిర్వర్తించేందుకు వచ్చిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను.. అక్కడున్న లెక్కింపు అధికారులు ఇంటికి వెళ్లమన్నారు. దాంతో వారంతా ఆందోళనకు దిగారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు ఉన్నతాధికారులు కొందరు సిబ్బందిని లెక్కింపు టేబుళ్ల వద్ద నియమించారు. ఖైరతాబాద్‌ జోన్‌లోని సనత్‌నగర్‌ లెక్కింపు కేంద్రంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఉదయం 5గంటలకు వచ్చిన తమను ఇళ్లకు వెళ్లమన్నారంటూ 200 మంది లెక్కింపు కేంద్రం బయట ఆందోళనకు దిగారు.


Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని