close

తాజా వార్తలు

Published : 25/09/2020 07:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ప్రయోగాత్మకంగా ఆరోగ్యవంతుల్లోకి కరోనా

లండన్‌: కొవిడ్‌-19 నివారణ టీకా అభివృద్ధిలో భాగంగా ‘సవాళ్లతో కూడిన ప్రయోగాన్ని’ చేపట్టనున్నట్లు బ్రిటన్‌ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. టీకా పొందిన ఆరోగ్యవంతులైన వాలంటీర్లలోకి కరోనా వైరస్‌ను చొప్పిస్తామని చెప్పారు. ఈ టీకా ద్వారా రక్షణ లభిస్తుందా అన్నది పరిశీలించడం దీని ఉద్దేశమని తెలిపారు. తొలిసారిగా ఈ తరహా ప్రయోగాన్ని నిర్వహించనున్నట్లు వివరించారు. దీనిపై లాంఛనంగా త్వరలో ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
ఈ ప్రయోగం జనవరిలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇందులో భాగంగా.. ప్రయోగదశలో ఉన్న ఒక టీకాను వాలంటీర్లకు ఇస్తారు. నెల తర్వాత వారిని కొవిడ్‌-19 కారక సార్స్‌-కోవ్‌-2 వైరస్‌కు గురిచేస్తారు. ఇందుకోసం దాదాపు 2వేల మంది వాలంటీర్లు ముందుకొచ్చారు. వారికి వేల పౌండ్లు చెల్లించే వీలుందని భావిస్తున్నారు. లండన్‌లోని క్వీన్‌ మేరీ విశ్వవిద్యాలయానికి సంబంధించిన హెచ్‌వివో సంస్థ ఈ ప్రాజెక్టును నిర్వహిస్తుంది. ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం కూడా ఇలాంటి ప్రయోగాన్ని నిర్వహించాలనుకుంటోంది.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.