close

తాజా వార్తలు

Published : 06/08/2020 09:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆలస్యమే...ఆయువు తీసింది...!

● వృద్ధురాలిని కాటేసిన పాము

● ద్విచక్రవాహనంపై ఆసుపత్రికి తరలింపు

 

ప్రాణరక్షకులుగా నిలవాల్సినవారే.. పని ఒత్తిడి పేరుతో.. పాముకాటుకు గురైన మహిళ మరణానికి కారణమయ్యారు. కొవిడ్‌ సేవల్లో ఉన్న ఇచ్ఛాపురం 108 వాహనం ఆసుపత్రి వద్దే ఉన్నా, నిబంధనల పేరిట ప్రాణాపాయస్థితిలో ఉన్నవారిని వదిలి.. వేరే ప్రాంతం నుంచి 108 వాహనాన్ని రప్పించే ప్రయత్నం చేశారు. గంటలు గడుస్తున్నా, ఆచూకీ లేని అంబులెన్సు.. వచ్చిన తరువాత మరో వాహన సిబ్బందితో వాదులాటకు దిగడంతో ఓ నిండుప్రాణం గాలిలో కలిసిపోయింది. పోలీసులు, బాధిత కుటుంబసభ్యులు తెలిపిన వివరాల మేరకు..

ఇచ్ఛాపురం: ముచ్చీంద్ర గ్రామానికి చెందిన సాడి తులసమ్మ(63) బుధవారం ఉదయం ఉదయం 7 గంటలకు స్నానానికి వెళ్లినపుడు ఆమెను పాము కాటేసింది. వెంటనే కుటుంబసభ్యులు ఇచ్ఛాపురం ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిలో చేర్చగా...ఆమెను శ్రీకాకుళం తీసుకువెళ్లాలని వైద్యులు సూచించారు. అక్కడ ఉన్న 108 వాహనం కొవిడ్‌విధుల్లో ఉండటంతో వేరే వాహనాలకు సమాచారమిచ్చారు. వాహనం వచ్చేసరికి ఆలస్యమైంది. బాధితురాలిని పట్టించుకోకుండా కవిటి, స్థానిక 108 సిబ్బంది పరస్పరం వాగ్వాదానికి దిగారు. ఉదయం 11 గంటలకు తులసమ్మను జిల్లా కేంద్రానికి తరలిస్తుండగా, మార్గమధ్యలో ఆమె తుదిశ్వాస విడిచింది. మృతదేహాన్ని ఆసుపత్రికి తీసుకొచ్చి బాధితులు ఆందోళనకు దిగారు.

ఎమ్మెల్యే అశోక్‌ దిగ్భ్రాంతి

పాముకాటుతో మహిళ మృతి చెందిన ఘటనపై ఇచ్ఛాపురం ఎమ్మెల్యే డా.బెందాళం అశోక్‌ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. జరిగిన సంఘటనపై విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలని, ఇచ్ఛాపురంలో వైద్యసేవలు మెరుగుపరచాలని కలెక్టరును కోరారు.

మెజిస్టీరియల్‌ విచారణకు ఆదేశం 

తులసమ్మ మృతి ఘటనపై తీవ్రంగా స్పందించిన కలెక్టరు జె.నివాస్‌ ఇచ్ఛాపురం తహసీల్దారుకు మెజిస్టీరియల్‌ విచారణ చేపట్టాలని ఆదేశించారు. ఈ మేరకు తహసీల్దారు శ్రీహరి, ఎస్సై వి.సత్యనారాయణ ఆసుపత్రికి వెళ్లి బాధితులతో మాట్లాడారు. అంబులెన్సులు, ఆసుపత్రి సేవలు బాగాలేవని ప్రసవానికి తీసుకొచ్చినా, శవాన్ని తిరిగిస్తున్నారని తులసమ్మ అల్లుడు దుర్యోధనరెడ్డి ఆరోపిస్తూ వైద్యసేవలు సరిగా అందించాలని కోరారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.