close

తాజా వార్తలు

Published : 03/08/2020 08:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఎస్సైకి కానిస్టేబుల్‌ ప్లాస్మా దానం

బక్రీద్‌ రోజున ఔదార్యం

మతసామరస్యానికి ప్రతీక అంటున్న నెటిజన్లు

కేశవగిరి, న్యూస్‌టుడే: కరోనా బారిన పడిన బాచుపల్లి ఎస్సై మహ్మద్‌ యూసుఫ్‌కు చాంద్రాయణగుట్ట ఠాణాకు చెందిన కానిస్టేబుల్‌ ఆర్‌.సాయికుమార్‌ ప్లాస్మా దానం చేయడాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. బక్రీదు రోజున దానం చేయడంతో ఈ సంఘటన మతసామరస్యానికి ప్రతీకగా అభివర్ణిస్తున్నారు. కరోనా కట్టడిలో ముందుండి పోరాడుతున్న పోలీసు సిబ్బందిలో ఒకరైన సాయికుమార్‌కు కరోనా సోకి పూర్తిగా కోలుకున్నాడు. గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మహ్మద్‌ యూసుఫ్‌ కరోనాతో బాధపడుతున్నాడని, అత్యవసర చికిత్స నిమిత్తం ఏబీ-పాజిటివ్‌ ప్లాస్మా అవసరమనే ప్రకటనను శనివారం సామాజిక మాధ్యమంలో చూశాడు. తనదీ అదే బ్లడ్‌ గ్రూప్‌ కావడంతో వెంటనే అక్కడికి వెళ్లి ప్లాస్మా దానమిచ్చాడు. ఆ తరువాతే యూసుఫ్‌ ఎస్సై అని అతనికి తెలిసింది. ఈ విషయం సామాజిక మాధ్యమంలో వైరల్‌ అయింది. బక్రీద్‌ పండగ రోజు ఓ ముస్లిం సోదరుడికి ఓ హిందువు ప్లాస్మా దానం చేయడాన్ని నెటిజన్లు ప్రశంసించారు. చాంద్రాయణగుట్ట సీఐ రుద్రభాస్కర్‌, డీఐ కె.ఎన్‌.ప్రసాద్‌వర్మ, ఎస్సైలు, గచ్చిబౌలి సీఐ జగదీశ్వర్‌రావు సాయికుమార్‌ను ప్రత్యేకంగా అభినందించారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.