close

తాజా వార్తలు

Updated : 07/07/2020 18:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

తెలంగాణలో కొవాగ్జిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభం

హైదరాబాద్‌: రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులను చూసి ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో భారత్‌ బయోటెక్‌ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్‌పై అందరూ ఆశలు పెట్టుకున్నారు. ఆ సంస్థ ఆవిష్కరించిన ‘కొవాగ్జిన్‌’ వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ ఇప్పుడు తెలంగాణలో ప్రారంభమయ్యాయి. క్లినికల్‌ ట్రయల్స్‌ కోసం ఆరోగ్యవంతులైన వ్యక్తుల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ నిమ్స్‌లో నేటి నుంచి ప్రారంభమైంది. ఆరోగ్యంగా ఉండి ట్రయల్స్‌కు సమ్మతించిన వ్యక్తుల రక్త నమూనాలను నిమ్స్‌ సిబ్బంది సేకరించనున్నారు. ఆ రక్త నమూనాలపై వివిధ రకాల వైద్య పరీక్షలు జరిపి.. ఆరోగ్యంగా ఉంటే వారం తర్వాత వారికి మొదటి డోస్‌ ఇస్తారు. 

‘‘ట్రయల్స్‌లో భాగంగా ఒక్కో వ్యక్తికి మూడు డోసులు ఇస్తాం. మొదటి డోస్‌ ఇచ్చిన తర్వాత ఆస్పత్రిలోనే రెండ్రోజులు పర్యవేక్షణలో ఉంచుతాం. 14 రోజుల తర్వాత రెండో డోస్‌ ఇస్తాం’’అని నిమ్స్‌ డైరెక్టర్‌ మనోహర్‌ వెల్లడించారు. 

 



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని