close

తాజా వార్తలు

Published : 07/07/2020 06:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సాయం కోరేందుకు 70 కి.మీ. సైకిల్‌ తొక్కిన వృద్ధుడు

చెన్నై: లాక్‌డౌన్‌తో జీవనాధారం కోల్పోయిన తనకు సాయం అందించాలని కోరేందుకు ఓ వృద్ధుడు 70 కిలోమీటర్ల దూరం నుంచి సైకిల్‌ తొక్కుకుంటూ కలెక్టరు కార్యాలయానికి వచ్చి వినతిపత్రం సమర్పించారు. తంజావూర్‌ జిల్లా ఏనానల్లూర్‌కు చెందిన నటేశన్‌ (73) దివ్యాంగుడు. వ్యవసాయ కూలీ పనులు లేనప్పుడు సైకిల్‌పై ముగ్గు పిండి అమ్ముతుండేవారు. ప్రస్తుతం లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోవడంతో ప్రభుత్వ సాయం కోరేందుకు తంజావూర్‌ జిల్లా కలెక్టరు కార్యాలయంలో వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. తన గ్రామానికి 70 కిలోమీటర్ల దూరంలో కలెక్టరు కార్యాలయం ఉండటం, లాక్‌డౌన్‌ కారణంగా రవాణా వసతి అంతగా లేకపోవడంతో సైకిల్‌పై  సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు బయలుదేరారు. ఉదయం 11 గంటలకు తంజావూర్‌ జిల్లా కలెక్టరు కార్యాలయానికి చేరుకున్నారు. అధికారులను కలిసి తనకు ప్రభుత్వ సాయం అందించాలని కోరారు. దివ్యాంగుడైన ఆయన కుంభకోణంలోని వైద్యుడి నుంచి ధ్రువపత్రం తీసుకుని రావాలని అధికారులు చెప్పడంతో అయోమయానికి గురయ్యాడు. అక్కడ భద్రతా విధుల్లో ఉన్న ఎస్సై సుకుమార్‌ జోక్యం చేసుకుని ఆయన్ను కలెక్టరు వద్దకు తీసుకెళ్లే ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత జిల్లా దివ్యాంగుల సంక్షేమ అధికారి వద్దకు ఆయన్ను తీసుకెళ్లారు. వైద్యుడి నుంచి ధ్రువపత్రం తీసుకుని అక్కడే ఉన్న తహశీల్దారు కార్యాలయంలో దానిని అందజేస్తే చాలని, తిరిగి కలెక్టరు కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదని సూచించారు. తంజావూర్‌ నుంచి తన స్వగ్రామానికి వెళ్లే మార్గంలోనే కుంభకోణం ఉంది.


 


 

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని