close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 04/07/2020 07:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కొత్తరకం కరోనాతో కంగారు

లండన్‌: కరోనా వైరస్‌ జన్యుక్రమంలో మార్పు చోటుచేసుకుందని, దాని వల్ల మానవుల్లో ఇన్‌ఫెక్షన్‌ కలిగించే సామర్థ్యం దానికి బాగా పెరిగిందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తిలో ఉన్న వైరస్‌ రకాల్లో ఈ కొత్త రకానిదే పైచేయి అని పేర్కొన్నారు. కొవిడ్‌ కారక సార్స్‌-కోవ్‌-2 వైరస్‌లో మార్పుల వల్ల ‘డీ614జీ’ అనే రకం వచ్చి పడిందని శాస్త్రవేత్తలు వివరించారు. ప్రయోగశాలల్లో నిర్వహించిన పరిశోధనల్లో దీనికి ఎక్కువ సాంక్రమిక లక్షణాలు ఉన్నట్లు తేలిందన్నారు. ‘‘ఈ రకం వైరస్‌.. తొలుత ఏప్రిల్‌ మొదటివారంలో మా దృష్టికి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఏ ప్రాంతంలోనైనా స్థానిక రకం కరోనా వైరస్‌లు అధికంగా వ్యాప్తి చెందుతున్న సందర్భంలో ఈ ‘డీ614జీ’ రకం ప్రవేశంతో పరిస్థితి తారుమారు అవుతోంది. ఈ కొత్త రకం వైరస్సే సింహభాగాన్ని ఆక్రమిస్తోంది’’ అని పరిశోధనకు నాయకత్వం వహించిన బెటె కోర్బర్‌ చెప్పారు. ఈ రకం వైరస్‌లో చాలా స్వల్పమైన మార్పు ఉందని, కానీ అది చాలా సమర్థమైందని తెలిపారు. వైరస్‌ పైపొరలో ఉండే కొమ్ము లాంటి ‘స్పైక్‌ ప్రొటీన్‌’లో ఈ మార్పు జరిగిందన్నారు. ఈ ఆకృతిని ఉపయోగించుకొని మానవ కణాల్లోకి ఈ వైరస్‌ ప్రవేశిస్తుంది.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.