close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 08/04/2020 09:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Comments

ఈ వారం కీలకం

ఇళ్లకే నిత్యావసర సరకుల పంపిణీ

రెడ్‌జోన్లలో భారీగా బందోబస్తు

 విజయవాడ : రోనా వ్యాప్తి నివారణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలి. ఎవరైనా నాకేమవుతుందిలే అనుకుంటే మాత్రం భారీమూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన లాక్‌డౌన్‌లో ఈ చివరి వారం ఎంతో కీలకం కానుంది. ఇప్పటికే పాజిటివ్‌ కేసులు నమోదైన ప్రాంతాలను ‘నో మూమెంట్‌ జోన్‌’లగా ప్రకటించారు. బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల నుంచి ప్రజలు బయటకు రావొద్దు, ఆయా ప్రాంతాలకు ఎవరూ వెళ్లొద్దని జిల్లా యంత్రాంగం హెచ్చరిస్తోంది. విజయవాడ నగరంతో పాటు.. మచిలీపట్నం, నూజివీడు, చందర్లపాడు మండలంలోని ముప్పాళ్ల, జగ్గయ్యపేట ప్రాంతాలను రెడ్‌జోన్లుగా గుర్తించారు. వీరు ఇబ్బందులు పడకుండా కూరగాయలు, నిత్యావసరాలను ఆటోల్లో తరలిస్తున్నారు.

జిల్లాలో ఇప్పటి వరకు కరోనా అనుమానిత లక్షణాలకు సంబంధించి 549 మంది నమూనాలను సేకరించారు. వీటిలో 29 మందికి పాజిటివ్‌ రాగా 245 మందికి నెగెటివ్‌ వచ్చింది. పాజిటివ్‌ వచ్చినవారిలో నలుగురు విదేశాల నుంచి వచ్చినవారు కాగా.. మిగిలిన 25 మంది దిల్లీ, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారున్నారు. సోమవారం 448 నమూనాలను తీసుకున్న అధికారులు మంగళవారం మరో 101 మంది దగ్గర నుంచి సేకరించారు. వీరిలో విదేశాల నుంచి వచ్చిన వారు, దిల్లీ నుంచి వచ్చినవారు, వారి కుటుంబ సభ్యులు, వారి కాంటాక్టులు ఉన్నారు. ఈ క్రమంలో కరోనాను మరింత కట్టడి చేసేందుకు.. జిల్లా యంత్రాంగం ఇంటింట సర్వే చేస్తున్నారు. మధుమేహం, బీపీ, ఊపిరితిత్తులు ఇతర వ్యాధులపై సమగ్ర వివరాలను గ్రామ, వార్డు వాలంటీర్లు, ఆశా వర్కర్లు సేకరిస్తున్నారు. కరోనా అనుమనితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

రెడ్‌జోన్లలో భారీ గస్తీ: జిల్లాలో మంగళవారం కొత్త కేసులేమీ నమోదు కాలేదు. వీటిలో విజయవాడ నగరంలోనే 18 ఉన్నాయి. దీంతో భవానీపురం, న్యూరాజరాజేశ్వరీపేట, సనత్‌నగర్‌, గాయత్రినగర్‌, రాణిగారితోట, కృష్ణలంక ప్రాంతాలను హాట్‌స్పాట్లుగా గుర్తించారు. ఈ ప్రాంతాల్లో ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లు, వైద్యాధికారులతో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. బాధితుల నివాస ప్రాంతాల నుంచి కిలోమీటరు మేర ఎలాంటి రాకపోకలకు వీల్లేకుండా బారికేడ్లను ఏర్పాటు చేశారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.