ఠాణా మెట్లెక్కకుండానే డిజిటల్‌ పాస్‌
close

తాజా వార్తలు

Published : 02/04/2020 07:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఠాణా మెట్లెక్కకుండానే డిజిటల్‌ పాస్‌

లాక్‌డౌన్‌ వేళ అత్యవసరాలకు ఉపయుక్తం

ఈనాడు, హైదరాబాద్‌: మీరు నిత్యావసర సరకులు సరఫరా చేస్తున్నారా..? ఆసుపత్రిలో చెకప్‌ కోసం సుదూర ప్రాంతానికి ప్రయాణించాల్సిన ఉందా..? ఆ సమయంలో రహదారులపై సాఫీగా వెళ్లడానికి పోలీసు అనుమతి తీసుకోవాలని భావిస్తున్నారా..? అందుకు ఠాణా చుట్టూ తిరగాల్సిన అవసరం ఇక ఎంతమాత్రం ఉండబోదు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో సామాన్యులతో పాటు వివిధ ప్రభుత్వ విభాగాల సిబ్బందికి ఆన్‌లైన్‌లోనే డిజిటల్‌ పాస్‌లు జారీ చేసేందుకు తెలంగాణ పోలీసు శాఖ కసరత్తు చేస్తోంది.

దరఖాస్తు ప్రక్రియ ఇలా..
పాస్‌లు అవసరమైన పౌరులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా ‘https://www.tspolice.gov.in’ లో కొత్త ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.  వెబ్‌సైట్‌లోకి వెళ్లగానే ఎడమవైపు పైభాగంలో ‘TS e-pass(during lock down)’ ఆప్షన్‌ ద్వారా దరఖాస్తు చేసుకొనే అవకాశం కల్పించనున్నారు. అందులోకి లాగిన్‌ అయి సెల్‌ నంబరుతోపాటు సంబంధిత వివరాల ప్రతులు జత చేస్తే విచారణ అనంతరం డిజిటల్‌ పాస్‌ జారీ చేయనున్నారు. ఒకట్రెండు రోజుల్లో ఇది అందుబాటులోకి రానుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని