సిద్దిపేటలో ఇంటింటికీ శానిటైజర్లు
close

తాజా వార్తలు

Published : 02/04/2020 07:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సిద్దిపేటలో ఇంటింటికీ శానిటైజర్లు

దాతల సహకారంతో 28 వేల సీసాల పంపిణీ

సిద్దిపేట, న్యూస్‌టుడే: రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతోంది. ఈ నేపథ్యంలో స్వీయ నిర్బంధం, వ్యక్తిగత పరిశుభ్రత కీలకంగా మారింది. దీన్ని గుర్తించిన రాష్ట్ర ఆర్థికమంత్రి హరీశ్‌రావు.. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ కేంద్రమైన సిద్దిపేటలో 28 వేల శానిటైజర్లను బుధవారం ఉచితంగా పంపిణీ చేయించారు. దాతల సహకారంతో ఈ ప్రక్రియ చేపట్టారు. బల్దియా ఛైర్మన్‌ కడవేర్గు రాజనర్సుతో పాటు ఇంటింటికీ తిరుగుతూ శానిటైజర్లను అందజేశారు. 180 మి.లీ.పరిమాణం కలిగిన సీసాను కుటుంబానికి ఒకటి చొప్పున ఇచ్చారు. తొలి రోజు బుధవారం 23 వార్డుల్లో ఈ ప్రక్రియ చేపట్టారు. మిగిలిన 11 వార్డుల్లో రెండు రోజుల్లో మరో 12 వేల శానిటైజర్లను పంపిణీ చేస్తామని రాజనర్సు తెలిపారు. గజ్వేల్‌కు సైతం పది వేల శానిటైజర్లను పంపినట్లు ఆయన చెప్పారు. సీసా మీది లేబుల్‌పైన కేసీఆర్‌, హరీశ్‌రావు చిత్రాలున్నాయి. దానిపై ‘మన రక్షణ మన చేతుల్లో... చేతల్లో.., ఇంట్లోనే ఉందాం...కరోనాను ఖతం చేద్దాం, చేతులు శుభ్రంగా ఉంచుకుందాం...కరోనాను తరిమేద్దాం’ అనే నినాదాలు రాయించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని