close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 31/03/2020 07:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Comments

అకారణంగా బయటికొస్తే బండి సీజ్‌

నగర పోలీసు కమిషనర్‌ హెచ్చరిక

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: లాక్‌డౌన్‌ నేపథ్యంలో.. ఎవరైనా కారణం లేకుండా రహదారులపై వస్తే బండి సీజ్‌ చేస్తామని నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ హెచ్చరించారు. సామాజిక ఐసోలేషన్‌ ద్వారా దానిపై విజయం సాధించవచ్చని సోమవారం జరిగిన సమావేశంలో ఆయన పేర్కొన్నారు. మతసంబంధిత భావాలను పక్కనపెట్టి ఇళ్లల్లోనే ప్రార్థన చేస్తున్నందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఎవరైనా ఆకలితో ఉన్నట్లు 100, 108కు లేదా పోలీస్‌ స్టేషన్‌, పెట్రోలింగ్‌ సిబ్బంది, బ్లూకోల్ట్‌కు సమాచారం అందిస్తే ఆహారం సమకూరుస్తామన్నారు. రానున్న పండుగ సందర్భంగా ఊరేగింపులు రద్దు చేస్తామని ప్రకటించిన నాయకులకు సీపీ కృతజ్ఞతలు తెలియజేశారు. విదేశాల నుంచి వచ్చినవారి జాబితా తమవద్ద ఉందని, 12వేల మంది స్వచ్ఛంద గృహ నిర్బంధంలో ఉన్నారని చెప్పారు.

లాక్‌డౌన్‌ సందర్భంగా నిత్యావసర సరకులను అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అత్యవరసర సేవల కింద ఇప్పటి వరకు 10వేల పాస్‌లు మంజూరు చేశామని, పాస్‌లు కావలసినవారు పురానీ హవేలీలోని కార్యాలయంలో, బషీర్‌బాగ్‌లోని కమిషనరేట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని సీపీ తెలిపారు. ఆన్‌లైన్‌లోనూ దరఖాస్తు చేసే అవకాశం ఉందని, దేశంలోనే ఈ సౌకర్యం కల్పించడం తొలిసారన్నారు. తప్పుడు సమాచారం వ్యాప్తిచేసే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ విషయంలో తప్పుడు సమాచారం ప్రసారం చేసిన ఓ ఛానల్‌కు నోటీసులు పంపించినట్లు కమిషనర్‌ చెప్పారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.