అదిగో కరోనా.. ఇదిగో హైరానా!
close

తాజా వార్తలు

Published : 29/03/2020 06:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అదిగో కరోనా.. ఇదిగో హైరానా!

స్థానికుల ఫోన్లతో పోలీసులు, వైద్యాధికారుల పరుగులు

నారాయణగూడ, న్యూస్‌టుడే: కరోనా జనాల్లో కొంత అనవసర ఆందోళనకు దారితీస్తోంది. పోలీసులను, వైద్యాధికారులను పరుగులు పెట్టింది. ఫలానా వ్యక్తికి కరోనా ఉందేమోనని అనుమానం ఉందని ప్రజలు ఫోన్లు చేస్తున్నారు.

బషీర్‌బాగ్‌లోని ఓ అపార్టుమెంట్‌లో ఓ వ్యక్తి దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారని, కరోనా లక్షణాలేమోనని అనుమానం ఉందంటూ నారాయణగూడ పోలీసులకు సమాచారం అందింది. ఎస్సై నవీన్‌ వైద్యాధికారులకు సమాచారం అందించారు. పోలీసులు, వైద్యాధికారులు అక్కడికి వెళ్లి.. సదరు వ్యక్తికి వైద్య పరీక్షలు నిర్వహించారు. సాధారణ జ్వరం, దగ్గు మాత్రమేనని చెప్పారు.

దాదాపు 15-20 రోజుల క్రితం అమెరికా నుంచి వచ్చిన ఓ మహిళ నారాయణగూడ, విఠల్‌వాడిలో ఉంటున్నారని.. ఆమె ఇంట్లోంచి బయటకు రాకుండా స్వీయనిర్బంధంలో ఉంటున్నారని నారాయణగూడ పోలీసులకు సమాచారం అందింది. ఎస్సై నవీన్‌ వైద్యాధికారి డాక్టర్‌ దీప్తికి ఫోన్‌ ద్వారా సమాచారం అందించారు. వైద్యాధికారి ఆ మహిళతో ఫోన్‌లో సంప్రదించారు. ఎస్సై నవీన్‌ ఆమె ఇంటికి వెళ్లి వివరాలు సేకరించారు. తాను వచ్చి 20 రోజులైందని.. స్వీయ నిర్బంధంలో ఉంటున్నానని తెలిపారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆమెకు ఎస్సై సూచించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని