ప్రాణాలు తీసిన కరోనా భయం!
close

తాజా వార్తలు

Updated : 29/03/2020 06:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రాణాలు తీసిన కరోనా భయం!

అనుమానంతో రేషన్‌ డీలర్‌ బలవన్మరణం

తుంగతుర్తి: కరోనా సోకిందనే భయంతో ఓ రేషన్‌ డీలర్‌ సజీవ దహనానికి పాల్పడ్డారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కరివిరాల గ్రామంలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకొంది. గ్రామానికి చెందిన వెలుగు శ్రీను (45) రేషన్‌ బియ్యం కోసం వచ్చిన ఓ వ్యక్తితో ఇటీవల కరచాలనం చేశాడు. ఆ వ్యక్తి కరీంనగర్‌ వలస వెళ్లి ఇటీవల వచ్చాడు. ఈ నేపథ్యంలో అతని ద్వారా తనకు కరోనా సోకిందేమోనని శ్రీను భయాందోళనకు గురయ్యాడు. జ్వరం, దగ్గు లక్షణాలు కనిపించడంతో ఈ నెల 25న సూర్యాపేటలో పరీక్షలు చేయించుకున్నాడు. కరోనా లక్షణాలు లేవని వైద్యులు పేర్కొన్నట్లు సమాచారం. నాటి నుంచి భార్య, పిల్లలతో దూరంగా ఉంటున్నాడు. శుక్రవారం పొలం వెళ్లి కంచెకుప్పపై పెట్రోల్‌ పోసి నిప్పంటించి మంటల్లో దూకి ఆత్మాహుతి చేసుకున్నాడు. చీకటి పడినా ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు వెతకగా బావి దగ్గర మంటల్లో సగం కాలి కనిపించాడు. శ్రీనుకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. భార్య రేణుక ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని