
తాజా వార్తలు
అంబులెన్స్కైనా దారివ్వండి..!
కరీంనగర్: ప్రజల అత్యుత్సాహం ప్రాణాల మీదకు తెస్తోంది. చాలా గ్రామాల్లో బయటవారు తమ గ్రామంలోకి రాకుండా, గ్రామస్థులు బయటకు వెళ్లకుండా కర్రలు, రాళ్లు, ముళ్ల కంచెలు రోడ్డుకు అడ్డంగా పెడుతున్నారు. పట్టణాల్లోని చాలా వీధుల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఇతరులు తమ గ్రామంలోకి రాకపోతే కరోనావైరస్ వ్యాపించదనే నమ్మకంతో వారు ఇలా చేస్తున్నారు. కానీ, ఈ క్రమంలో ఆ మార్గంలో వెళ్లాల్సిన అంబులెన్స్ సిబ్బంది ఇబ్బంది పడుతున్నాయి. ఎవరి ప్రాణాలో ప్రమాదంలో ఉంటే రక్షించడానికి వెళ్లే వాహనాలు కూడా వెళ్లకుండా చేస్తున్నారు. తాజాగా కరీంనగర్ జిల్లా వీణవంక మండలం గంగారంలో గ్రామంలోకి ఎవరూ రాకుండా గ్రామస్థులు ముళ్ళకంచెలు వేశారు. అత్యవసర పరిస్థితుల్లో ఆ మార్గంలోకి వచ్చిన 108 అంబులెన్స్ చిక్కుకుపోయింది. ముళ్ళ కంచె వేయడం సరికాదని అవసరమైతే కర్రలతో టెన్షన్ ఏర్పాటు చేసుకోవాల్సిందని అంబులెన్స్ సిబ్బంది వాపోయారు.