close

తాజా వార్తలు

20 ఏళ్ల తర్వాత కుటుంబం చెంతకు


తల్లి, కుటుంబ సభ్యులతో గంగాధరన్‌

అరకులోయ: ఒకటి కాదు, రెండు కాదు.. 20 ఏళ్ల తర్వాత తల్లిదండ్రులను వెతుక్కుంటూ అరకులోయ వచ్చిన గంగాధరన్‌ బాల్యస్మృతులను గుర్తుకు తెచ్చుకుని ఎట్టకేలకు తల్లిని, స్వగ్రామాన్ని గుర్తించాడు. విశాఖ జిల్లా అరకులోయ మండలం బొండాం పంచాయతీ మజ్జివలసకు చెందిన సింహ్రాదితో సంక్రాంతి పండగకు ముందు వెళ్లిన గంగాధరన్‌ అక్కడే ఉండిపోయారు. చిన్నతనంలో దిగిన ఫొటోలను చూసిన అతడు సింహాద్రిని తల్లిగా గుర్తించడంతో సంక్రాంతి పండగ వేళ ఆమె ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తొమ్మిదేళ్ల వయసులో గంగాధరన్‌ విశాఖ రైల్వే స్టేషన్‌లో తప్పిపోయి చెన్నై వెళ్లే రైలు ఎక్కాడు. చెన్నైలో పోలీసులు అతడ్ని ఓ అనాథ ఆశ్రమానికి అప్పగించారు. ప్రస్తుతం ఎల్‌ఐసీలో ఉద్యోగం చేస్తున్న గంగాధరన్‌ అంతర్జాలంలో అరకులోయ ఫొటోలు చూసి తల్లిదండ్రులను వెతుక్కుంటూ వారం కిందట ఇక్కడకు వచ్చిన విషయం తెలిసిందే. కుటుంబసభ్యులను గుర్తించడంతో స్థానిక పోలీసులు గంగాధరన్‌ను వారికి అప్పగించారు. ఇప్పటి వరకు అనాథ శరణాలయంలో పెరిగి నా అన్న వాళ్ల ప్రేమను పొందలేకపోయిన గంగాధరన్‌ను తల్లి సింహాద్రి, తమ్ముడు, చెల్లెలు, బంధువులు అక్కున చేర్చుకున్నారు. సంక్రాంతి వేడుకలను ఆనందంగా జరుపుకొన్నారు.

కన్నీళ్లు ఆగలేదు

చిన్నప్పుడు తప్పిపోయిన అన్నయ్య 20 ఏళ్ల తర్వాత రావడం సంతోషంగా ఉంది. అన్నయ్యను చూసి కన్నీళ్లు ఆగలేదు. అందర్నీ గుర్తించాడు. ఇక నుంచి ఇక్కడే ఉండిపోతాడు. - రత్నమణి, సోదరి

అమ్మతో ఉండిపోతా..

రెండు దశాబ్దాలపాటు తల్లిదండ్రులు, బంధువులకు దూరంగా ఒంటరిగా గడిపా. చెన్నై వెళ్లకుండా అమ్మతో ఇక్కడే ఉండిపోతా. అమ్మ, చెల్లి, తమ్ముడు అందరూ ఆనందంగా ఉన్నారు. - గంగాధరన్‌

ఆనందంగా ఉంది

20 ఏళ్ల కిందట తప్పిపోయిన కొడుకు తిరిగిరావడం చాలా ఆనందంగా ఉంది. జీవితంలో పెద్ద కొడుకును చూడలేననుకున్నా. భగవంతుడు పంపాడు. ఇన్నాళ్లూ ఇబ్బందులు పడ్డ గంగాధరన్‌ను జాగ్రత్తగా చూసుకుంటాం.

- సింహాద్రి, తల్లి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.