
తాజా వార్తలు
రజనీకాంత్ వ్యాఖ్యలపై స్పందించను..
కున్నూర్ కార్యక్రమంలో పాల్గొన్న కనిమొళి
చెన్నై, న్యూస్‌టుడే: రాజకీయ అరంగేట్రంపై స్పష్టత ఇస్తూ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలపై స్పందించడానికి ఇష్టం లేదని డీఎంకే మహిళా విభాగం కార్యదర్శి, తూత్తుకుడి ఎంపీ కనిమొళి తెలిపారు. ‘విడియలై నోక్కి..’ ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆమె నీలగిరి జిల్లా విచ్చేశారు. కున్నూర్‌లో అణ్ణాదురై విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తర్వాత దివంగత మాజీ ఎమ్మెల్యే రంగనాథన్ ఇంటికి వెళ్లి ఆయన చిత్రపటానికి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా విలేకర్లతో ఆమె మాట్లాడారు. అవినీతి రహిత పాలన ఏర్పాటు చేస్తానంటూ రజనీ చేసిన వ్యాఖ్యలు డీఎంకేను ఉద్దేశించినవంటూ మంత్రి జయకుమార్ చెప్పడంపై విలేకర్లు ప్రశ్నించారు. దీనిపై ఆమె స్పందిస్తూ.. రజనీకాంత్ ఇంకా రాజకీయాల్లోకి రాలేదన్నారు. అలాంటప్పుడు ఆయన గురించి స్పందించబోనని తెలిపారు.
Tags :
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
చిత్ర వార్తలు
సినిమా
- ఇండస్ట్రీలో నాకు పోటీ ఎవరో ఇన్నాళ్లకు తెలిసింది
- ‘ఉప్మాపాప’కు థాంక్స్ చెప్పిన రామ్..
- సమాధానం కావాలా..నీ దేశానికి వెళ్లిపో
- ఒక్క వికెట్ తీస్తేనేం..సిరాజ్ సూపర్: సచిన్
- శెభాష్ నట్టూ..కసి కనిపిస్తోంది: రోహిత్
- మొదటి వరసలో ఆ ఇద్దరూ!
- యాష్ లేకున్నా సుందర్ నష్టం చేశాడు: ఆసీస్
- ముక్క కొరకలేరు!
- మహేశ్‌బాబు అందానికి రహస్యమదే: విష్ణు
- ‘సలార్’ ప్రారంభోత్సవ వీడియో చూశారా..?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
