close

తాజా వార్తలు

Updated : 05/12/2020 10:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

హ్యాట్రిక్‌.. అంతకు మించి

నాలుగుసార్లు గెలిచిన వారు నలుగురు

గెలిచిన అనంతరం విజయసంకేతం చూపిస్తున్న మాజిద్‌ హుస్సేన్‌, నేతలు

ఈనాడు, హైదరాబాద్‌: గ్రేటర్‌ ఎన్నికల్లో అయిదుగురు హ్యాట్రిక్‌ సాధించగా వారిలో ఇరువురు ఎంఐఎం, మిగతా ముగ్గురు తెరాస అభ్యర్థులున్నారు. మరో నలుగురు నాలుగుసార్లు విజయం సాధించడం విశేషం. ఎంఐఎం తరఫున మాజిద్‌ హుస్సేన్‌ 2009 ఎన్నికల్లో అహ్మద్‌నగర్‌ నుంచి గెలుపొంది మేయర్‌ అయ్యారు. 2016లోనూ, ఈసారి మెహిదీపట్నం నుంచి గెలిచారు. అక్బర్‌బాగ్‌ డివిజన్‌ నుంచి సయ్యద్‌ మినాజుద్దీన్‌ 2009, 2016, ఈసారి వరుసగా విజయం సాధించడం విశేషం. మచ్చబొల్లారం డివిజన్‌ నుంచి జితేంద్రనాథ్‌ 2010లో తెదేపా తరఫున, 2016, 2020లో తెరాస నుంచి గెలిచారు. గాజులరామారం అభ్యర్థి రావుల శేషగిరి 2009లో కాంగ్రెస్‌, 2016, 2020లో తెరాస నుంచి కార్పొరేటర్‌గా గెలుపొందారు. ఓల్డ్‌బోయిన్‌పల్లి డివిజన్‌ నుంచి తెరాస తరపున గెలిచిన ముద్దం నర్సింహయాదవ్‌ కూడా హ్యాట్రిక్‌ సాధించారు.

వరుసగా నాలుగుసార్లు: రియాసత్‌నగర్‌ డివిజన్‌ ఎంఐఎం అభ్యర్థి ముస్తఫా బేగ్‌ వరుసగా నాలుగోసారి గెలుపొందడం విశేషం. ● రామ్నాస్‌పురా డివిజన్‌ ఎంఐఎం అభ్యర్థి మహ్మద్‌ ముబీన్‌ సైతం 2002లో ఆగాపురా నుంచి 2009, 2016లో రామ్నాస్‌పురా, ఈసారి శాస్త్రిపురం నుంచి గెలుపొందారు. ● గోషామహల్‌ నియోజకవర్గంలోని బేగంబజార్‌ డివిజన్‌ భాజపా అభ్యర్థి గొంటి శంకర్‌యాదవ్‌ వరుసగా నాలుగో పర్యాయం జయకేతనం ఎగరేశారు. 2002, 2009లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలుపొందగా.. 2016లో భాజపా నుంచి పోటీ చేసి హ్యాట్రిక్‌ కొట్టారు. నాలుగోసారీ ఆయన్నే గెలుపు వరించింది.


తగ్గినా..నెగ్గారు

స్వల్ప ఆధిక్యంతో పలువురు అభ్యర్థుల గెలుపు

ఈనాడు, హైదరాబాద్‌

గ్రేటర్‌ ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకమే. ఈసారి ఎన్నికలను తెరాస, భాజపా ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో పోటీ నువ్వా నేనా అన్నట్లుగా కొనసాగింది. ఫలితాల సరళి కూడా దీన్ని ప్రతిబింబించింది. 150 డివిజన్లకు జరిగిన ఎన్నికల్లో 12 చోట్ల స్వల్ప ఆధిక్యంతో అభ్యర్థులు గెలుపొందారు. తక్కువ ఆధిక్యంతో అత్యధిక స్థానాలను భాజపా గెల్చుకోగా.. సిట్టింగ్‌ స్థానాలను తెరాస చేజార్చుకుంది.


Tags :

రాజకీయం

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని