close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120080454 [video_srlno] => 1 [video_type] => 1 [video_link] => NOjtqWW7sMk [video_short_link] => NOjtqWW7sMk [created_by] => [created_date] => [modified_by] => 9820033 [modified_date] => 2020-06-28 17:57:50.552876 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

Published : 29/06/2020 01:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

దేశం గర్వించదగిన ప్రధాని పీవీ 

కవయిత్రి జయప్రభతో ముఖాముఖి

ఇంటర్నెట్‌ డెస్క్‌: మాజీ ప్రధాని, ఆర్థిక సంస్కరణల పితామహుడు, బహుభాషా కోవిదుడు పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. పీవీ రాజకీయ నాయకుడిగా రాణించడంతోపాటు అనేక రచనలు చేశారు. ప్రముఖ కవులతో కలిసి పనిచేశారు. దివంగత ప్రధాని శత జయంతిని పురస్కరించుకొని ప్రముఖ కవయిత్రి అనిపిండి జయప్రభతో ఈటీవీ ముఖాముఖి నిర్వహించింది. కాగా ఆమె పీవీ గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. కవయిత్రిగా కొద్దికాలంపాటు మాజీ ప్రధానితో సాగిన ఆమె ప్రయాణం. ఆమె రాసిన కవితలను పీవీ నరసింహారావు ఆంగ్లంలోకి అనువదించిన వైనం.. ఆయన రాజకీయ జీవితంలోవి విశేషాలు, ఒడిదొడకులు.. రచనల్లో పీవీ అభిరుచులు.. తదితర అంశాలను జయప్రభ ఈటీవీతో పంచుకున్నారు.

ఈటీవీ: పీవీ గారి శతజయంతి ఉత్సవాలను ప్రభుత్వం వైభవంగా నిర్వహించాలని నిర్ణయించింది. దీనిపై మీ అభిప్రాయం? 
జయప్రభ: భారతదేశ చరిత్రలోనే గర్వించదగ్గ ప్రధాని పీవీ నరసింహరావు. దేశం సంక్షోభ స్థితిలో ఉన్నప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయాలు చిరస్మరణీయం. మాజీ ప్రధాని శతజయంతి ఉత్సవాలను ఎంతో గొప్పగా నిర్వహించి తీరాల్సిన అవసరం ఉంది. పీవీకి భారతరత్న ఇవ్వాలి అని సీఎం కేసీఆర్‌ అనడం సంతోషకర విషయం. ఆ అవార్డుకు పీవీ సమర్థుడు. పార్టీలకు అతీతంగా ప్రతిఒక్కరు ఇందుకోసం పోరాడాలి. 
ఈటీవీ: పీవీ గారు గంభీరమైన వ్యక్తి. నిర్ణయాలను పటిష్టంగా తీసుకునేవారు. వాటితోపాటు సున్నితమైన కవిత్వాలను ప్రేమించేవారు. ఈ రెండింటిని ఆయన ఎలా బ్యాలెన్స్‌ చేసుకునేవారు?
జయప్రభ: ఒక రంగంలో నిష్ణాతులు అయినవారు రెండో రంగం నంచి కొంత దూరంగా ఉండాల్సి వస్తుంది. కానీ పీవీలో ఎన్నో ప్రతిభలు దాగి ఉన్నాయి. ఆయన నిరంతర పిపాసి. తెలుసుకోవాలనే కుతూహలాన్ని ప్రదర్శించేవారు. మాట్లాడటం కంటే ఎక్కువగా వింటూ ఎన్నో విషయాలను నేర్చుకునేవారు. ఓర్పు, పట్టుదల గల వ్యక్తి. ఎంతో నిరాడంబరుడు. సమయం దొరికినప్పుడల్లా పుస్తకాలు చదివేవారు. 

ముఖాముఖిలోని మరిన్ని విషయాలను తెలుసుకునేందుకు కింది వీడియోను చూడండి..
 

 



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.