close

తాజా వార్తలు

Published : 25/06/2020 22:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కరోనా ఉద్ధృతి.. తెలంగాణకు మళ్లీ కేంద్ర బృందం

దిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మహమ్మారి తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు కేంద్ర బృందాలను మరోసారి పంపాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త  కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ నేతృత్వంలోని ఈ బృందం గుజరాత్‌, మహారాష్ట్ర, తెలంగాణల్లో మూడు రోజుల పాటు పర్యటించనుంది. రేపటి నుంచి ఈ నెల 29వరకు ఈ బృందం ఈ మూడు రాష్ట్రాల్లో పర్యటిస్తుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలపై అధికారులతో చర్చించడం,  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయాన్ని మెరుగుపరిచే ఉద్దేశంతోనే ఈ బృందం పర్యటిస్తుందని పేర్కొంది.

దేశంలో రికార్డు స్థాయిలో ఈ రోజు సుమారు 17వేల కేసులు నమోదు కావడం కలవర పెడుతోంది. మహారాష్ట్రలో ఇప్పటివరకు అత్యధికంగా 1,42,900 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. గుజరాత్‌లో 28,943, హైదరాబాద్‌లో 10,331  చొప్పున కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.