close

తాజా వార్తలు

Published : 25/06/2020 08:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ - 9 AM

1.నేటి నుంచి ఆరో విడత హరితహారం

తెలంగాణవ్యాప్తంగా ఆరోవిడత హరితహారం గురువారం ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మెదక్‌ జిల్లా నర్సాపూర్‌లో ఉదయం 11.30 గంటలకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఇక్కడ 630 ఎకరాల్లో ఏర్పాటుచేసిన అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కును ప్రారంభిస్తారు. ఆకుపచ్చ తెలంగాణ సాధించడం, రాష్ట్రంలో అటవీ విస్తీర్ణాన్ని 33 శాతానికి పెంచడం, రాష్ట్రాన్ని పర్యావరణహితంగా చేయడం హరితహారం లక్ష్యం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. రూ.1,10,000 కోట్లు

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్మాణ వ్యయం సుమారు రూ.లక్షా పదివేల కోట్లకు చేరనుంది. మొదట రెండు టీఎంసీల నీటి మళ్లింపు లక్ష్యంకాగా.. గత ఏడాది అదనంగా మరో టీఎంసీ నీటిని మళ్లించే పనులను ప్రభుత్వం చేపట్టింది. వీటన్నింటికి కలిపి నీటిపారుదల శాఖ అంచనా వేస్తోంది. పెట్టుబడి అనుమతి కోసం ప్రతిపాదనలు పంపేందుకు తాజా ధరలతో సవరించిన అంచనా కావాలని కేంద్ర జలసంఘం సూచించడంతో నీటిపారుదల శాఖ కసరత్తు చేస్తోన్నట్లు తెలిసింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. వైకాపా ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాణిక్య వరప్రసాద్‌

ఎమ్మెల్యేల కోటాలో ఏపీ శాసన మండలి స్థానానికి జరగనున్న ఉప ఎన్నికలకు వైకాపా అభ్యర్థిగా డొక్కా మాణిక్య వరప్రసాద్‌ పేరు ఖరారైంది. ఆయన గురువారం ఉదయం నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. ఆయన్ను ప్రతిపాదిస్తూ పది మంది ఎమ్మెల్యేల సంతకాలతో సహా నామినేషన్‌ ప్రక్రియకు వైకాపా ఏర్పాట్లు చేసింది. అభ్యర్థిగా డొక్కా పేరును వైకాపా అధికారికంగా ప్రకటించలేదు. ఆయనతో నేరుగా నామినేషన్‌ దాఖలు చేయిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. అచ్చెన్నాయుడి కేసులో అర్ధరాత్రి హైడ్రామా

ఈఎస్‌ఐ మందుల కొనుగోలులో అవకతవకల అభియోగంపై అరెస్టయిన మాజీ మంత్రి అచ్చెన్నాయుడి వ్యవహారంలో మరోమారు అర్ధరాత్రి హైడ్రామా నెలకొంది. ఈ నెల 25 నుంచి 27 వరకూ మూడు రోజుల అనిశా కస్టడీకి ఇస్తూ విజయవాడ న్యాయస్థానం బుధవారం ఉదయం ఉత్తర్వులు జారీ చేసింది. చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో ఉన్న అచ్చెన్నాయుడి వద్దకు వెళ్లి న్యాయవాది, ప్రభుత్వ వైద్యుడి సమక్షంలో అనిశా అధికారులు వివరాలు సేకరించాలని స్పష్టం చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. మృతదేహాల నుంచి వ్యాప్తి తక్కువే

‘‘కరోనా వైరస్‌ గురించి పూర్తిగా ఎవరికీ తెలియదు. వ్యక్తుల నుంచి వ్యక్తులకు వస్తోందనే ఇప్పటివరకు తెలుసు. చనిపోయినవారి నుంచి వైరస్‌ సోకుతుందనే దానికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సోకే అవకాశం తక్కువే. మృతదేహం నుంచి ఏమైనా స్రావాలు బయటికి వచ్చి, వాటిని ఇతరులు తాకితే మాత్రం వైరస్‌ సోకే ప్రమాదం ఉంది’’ అని సీసీఎంబీ డైరెక్టర్‌ రాకేశ్‌ కె. మిశ్రా తెలిపారు. ఆయన పూర్తి ఇంటర్వ్యూ కోసం క్లిక్‌ చేయండి 

6. ఐటీ రిటర్నుల గడువు

కరోనా నేపథ్యంలో 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయపు పన్ను (ఐటీ)రిటర్నుల సమర్పణ గడువును జులై 31 వరకు పెంచుతూ బుధవారం కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీటీడీ) ఉత్తర్వులు జారీ చేసింది. 2019-20కు చెందిన రిటర్నుల సమర్పణ గడువును నవంబరు 30 వరకు పెంచుతూ గతంలోనే ఆదేశాలు ఇవ్వడం గమనార్హం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. అడిగినంత చెల్లిస్తేనే ఆన్‌లైన్‌ తరగతులు

 కరోనా పరిస్థితుల్లో కార్పొరేట్‌ కళాశాలలు కొన్ని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభిస్తున్నామని, మీ పిల్లలే వెనకబడిపోతారని తల్లిదండ్రులను మానసికంగా బ్లాక్‌మెయిల్‌ చేస్తూ ఫీజులు ముందస్తుగా అధికంగా లాగుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఏటా 4.80 లక్షల మంది ఇంటర్‌ మొదటి ఏడాదిలో చేరుతుండగా కార్పొరేట్‌ కళాశాలల్లో 2.50 లక్షల మంది ప్రవేశాలు పొందుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. 1 నుంచి ఇంటర్‌ వరకు కొత్త సిలబస్‌

దేశవ్యాప్తంగా ఒకటి నుంచి 12వ తరగతి వరకు 2021-22 విద్యా సంవత్సరం నాటికి కొత్త సిలబస్‌ అందుబాటులోకి రానుంది. నూతన జాతీయ కరికులమ్‌ ఫ్రేమ్‌వర్క్‌(ఎన్‌సీఎఫ్‌) రూపకల్పన పని ప్రారంభమైంది. దీని ప్రకారం జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎన్‌సీఈఆర్‌టీ) పాఠ్య పుస్తకాలను రూపొందించనుంది. కొత్త సిలబస్‌ తయారీ ప్రక్రియను నిపుణులు త్వరలో ప్రారంభించనున్నారు. డిసెంబరు కల్లా మధ్యంతర నివేదిక అందజేయనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. బాయ్‌కాట్‌ చైనా: ఎవరికి లాభం ఎవరికి నష్టం

భారత్‌-చైనా సరిహద్దుల్లో భారత జవాన్ల వీరమరణం ఏ భారతీయుడి రక్తాన్నయినా మరిగించే అంశమే. భావోద్వేగాన్ని నింపే విషయమే. అదే విధంగా మనతో కయ్యానికి కాలు దువ్వుతున్న  ఆ దేశం తయారు చేసే ఉత్పత్తులు మనమెందుకు ఉపయోగించాలన్న వాదనా సబబే. బాయ్‌కాట్‌ చైనా అనే నినాదాన్నీ తప్పుపట్టలేం. మరి ద్వైపాక్షిక ఆర్థిక బంధాలను తెగదెంపులు చేసుకుంటే ఎవరికి నష్టం.. ఎవరికి లాభం? ఇంతకీ మనం చైనాపై ఎంత ఆధారపడి ఉన్నాం? పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి 

10. పాక్‌లో రూ.10 కోట్లతో శ్రీకృష్ణుడి ఆలయం

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ ప్రభుత్వం.. ఇస్లామాబాద్‌లో రూ.10 కోట్లతో నిర్మించ తలపెట్టిన శ్రీకృష్ణుడి ఆలయానికి శంకుస్థాపన జరిగింది. 20 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఆలయ నిర్మాణం జరగనుంది. మంగళవారం జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో పాకిస్థాన్‌ మానవ హక్కుల పార్లమెంటరీ కార్యదర్శి లాల్‌ చంద్‌ మల్హి మాట్లాడుతూ.. ‘‘గత రెండు దశాబ్దాల్లో ఇస్లామాబాద్‌లో హిందువుల జనాభా పెరిగింది. అందువల్ల ఆలయం అవసరం ఏర్పడింది’’ అని చెప్పారు. ఆలయ నిర్మాణ ఖర్చు మొత్తాన్ని పాకిస్థాన్‌  ప్రభుత్వం భరించనుంది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.