close

తాజా వార్తలు

Published : 24/06/2020 11:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

13 నెలల్లో రూ.4770 కోట్లు ఇచ్చాం: జగన్‌

‘వైఎస్సార్‌ కాపు నేస్తం’ ప్రారంభించిన సీఎం

తాడేపల్లి: కాపు మహిళలకు అండగా ఉండేందుకు రూపొందించిన ‘వైఎస్సార్‌ కాపు నేస్తం’ పథకాన్ని ఏపీ సీఎం జగన్‌ ప్రారంభించారు.  కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు చెందిన మహిళల్లో 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారికి వర్తించే ఈ పథకాన్ని  తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ’’అభివృద్ధి, సంక్షేమమే అజెండాగా పాలన సాగిస్తున్నాం. అర్హులైన కాపు మహిళలకు ఏటా రూ.15వేలు చొప్పున ఆర్థిక సాయం చేస్తాం. తొలి ఏడాదిలో రూ. 354 కోట్ల ఖర్చుతో దాదాపు 2.36లక్షల మంది కాపు మహిళలకు లబ్ధి కలగనుంది. అర్హులందరికీ న్యాయం చేయాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం’’ అన్నారు. 

జాబితాలో పేరులేకపోతే మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు

13 నెలల కాలంలో జగనన్న అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, విదేశీ విద్యా దీవెన, రైతు భరోసా, పింఛను కానుక, వాహన మిత్ర, చేదోడు, నేతన్న నేస్తం, ఇళ్ల పట్టాలు, కాపు నేస్తంతో కలిపి చూస్తే ఇప్పటివరకు రూ.4,770 కోట్లు ఇచ్చామని గర్వంగా చెప్పగలుగుతున్నా. ఈ పథకాల ద్వారా 22.89లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూర్చాం. ఏడాదికి సగటున రూ.400 కోట్లు కూడా ఇవ్వని పరిస్థితులు గత ఐదేళ్ల కాలంలో ఉన్నాయి. మేం ఎన్ని నిధులు ఇచ్చామో ప్రజలు గమనించాలి.  జాబితాలో ఎవరి పేరు లేకపోయినా మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు.’’ అని అన్నారు. 

తాజాగా ప్రారంభించిన కాపు నేస్తం ద్వారా  అర్హులైన మహిళలకు ఏటా రూ.15000 చొప్పున ఐదేళ్లలో మొత్తం రూ.75వేలు ఆర్థికసాయం అందించనున్నారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 2, 35873మంది లబ్ధిదారులను ప్రభుత్వం గుర్తించింది. వారందరికీ ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా ఖాతాల్లో జమ చేయనున్నారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.