close

తాజా వార్తలు

Published : 21/06/2020 01:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మద్యం వ్యాపారిని పరుగులు పెట్టించింది..

సిర్పూర్‌: ఓ మద్యం వ్యాపారిని మహిళా సర్పంచి  పరుగులు పెట్టించింది. ఈ ఘటన మహారాష్ట్రలోని సిర్పూర్‌ తాలుకాలో పింప్రి డుమారా గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామంలో గత కొంత కాలంగా మద్యం దుకాణాలు ఊపందుకున్నాయి. దీంతో అక్కడి కుటుంబాల్లో గొడవలు రావడం గుర్తించిన సర్పించి మనీషా కెద్కర్‌.. ఆ మద్యం విక్రేతకు బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంది. అనుకున్నదే తడవుగా రోడ్డుపైనే ఆ యజమానిని కర్రతో చితకబాదింది. దీంతో దెబ్బలకు తాళలేక ఆ వ్యాపారి పరుగులు పెట్టాడు. గ్రామంలో మళ్లీ మద్యం అమ్మకాలు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయిని ఆమె హెచ్చరించింది.  మద్యం అమ్మకాలతో తమ గ్రామంలో కలహాలు పెరిగిపోతున్నాయనీ.. అందువల్లే ఆ వ్యాపారిని కొట్టి బుద్ధి చెప్పినట్టు మనీషా తెలిపారు.



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.