బాల్కనీలో ఏ కూరలు పెంచుకోవచ్చు?
close

తాజా వార్తలు

Published : 20/06/2020 00:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బాల్కనీలో ఏ కూరలు పెంచుకోవచ్చు?

మేం అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నాం. తొలకరి వర్షాలు పడుతున్నాయి. కుండీల్లో కూరగాయలు పెంచాలనుకుంటున్నా. తూర్పు ఎండ మొక్కలపై బాగానే పడుతుంది. నేను ఎలాంటివి నాటొచ్చు? ఇందుకోసం మట్టిని ఎలా సిద్ధం చేసుకోవాలో తెలుపగలరు? దానికి ఎటువంటి శ్రద్ధ అవసరం?

- శ్రీలత, హైదరాబాద్‌
 

కుండీలలో కూరగాయల విత్తనాలు నాటుకునేందుకు ఇదే సరైన సమయం. అపార్ట్‌మెంట్‌లో పాక్షికంగా పడే ఎండతో ఆకుకూరలు బాగానే పెరుగుతాయి. పాలకూర, పుదీనా, కొత్తిమీర, గోంగూర, తోటకూర, బచ్చలికూరల్ని సులువుగా పెంచుకోవచ్చు, కుండీలో మూడొంతుల ఎర్రమట్టి, ఒకవంతు వర్మీకంపోస్టు లేదా  పశువుల ఎరువును కలిపి కుండీల్లో నింపుకోవాలి. కుండీ అడుగు భాగంలో మిగులు నీరు పోయేందుకు వీలుగా చిన్న రంధ్రం ఉండేలా చూసుకోవాలి. ఆకుకూరల విత్తనాలు చిన్నగా ఉండి తేలిగ్గా ఉంటాయి. కాబట్టి ఇసుక లేదా మట్టితో కలిపి పలుచగా కుండీలో ఒక పొరగా చల్లి వాటిపై సన్నమట్టిని పలుచగా వేయాలి. ఆ తరువాత విత్తనాలపై నీళ్లు చల్లితే ఆరేడు రోజుల్లో ఆ విత్తనాలు మొలకెత్తుతాయి. మట్టిలో వేప పిండి కలిపితే శిలీంధ్రాలు, పురుగులు రావు. 20-25 రోజుల్లో ఆకుకూరలు తెంచుకోవచ్చు. ఆకులను మాత్రమే కత్తిరించి ఆ వెంటనే ఎరువులను మొక్కకి అందిస్తే మరోవారంలో తెంచుకునేందుకు వీలుగా ఆకులు ఎదుగుతాయి. కుండీల్లోని మట్టి పై పొర పొడిబారితేనే నీళ్లు పోయాలి. ఎక్కువ రోజులు మబ్బుగా ఉన్నప్పుడు మధ్యలో వేపనూనెను పిచికారీ చేస్తే మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి. తరువాత మూడు నాలుగు రోజులు ఆగి ఆకుకూరలు తెంపుకోవాలి. మిద్దెతోట అయి ఉండి సూర్యరశ్మి బాగా అందితే వంగ,    బెండ, టొమాటో, చిక్కుడు వంటి కాయగూరల్ని   పెంచుకోవచ్చు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని