మీ సమయం... మీ చేతుల్లో!
close

తాజా వార్తలు

Published : 20/06/2020 00:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మీ సమయం... మీ చేతుల్లో!

ఎంత ప్రణాళికగా ఉన్నా సరే... సమయం మనచేతుల్లోంచి జారిపోతూనే ఉంటుంది. అరె... ఒక గంట తీరిక సమయం దొరికితే బాగుండును అనుకుంటున్నారా? అంతకంటే ఎక్కువే దొరుకుతుంది. ఎలా అంటారా? ఇదిగో ఇలా!
ఇంట్లోవాళ్లందరూ నిద్ర లేచే సమయానికంటే ముందుగానే మనం నిద్ర లేస్తే ఏ ఆటంకం లేకుండా పనులు చకచకా పూర్తవుతాయి. ఉదయంపూట మెదడు చురుగ్గా కూడా ఉంటుంది. అలసట తెలియకుండా పనులు చేసుకునే సమయం అది. మొదట్లో పెందలాడే లేవడం కష్టంగా అనిపించినా అదో అలవాటుగా మార్చుకుని చూడండి.. మీ సమయం మీ చేతుల్లో ఉంటుంది. ఎంతో మంది విజేతల రహస్యం కూడా ఇదేనట.
* ఉదయం లేవడం సరే! ఆ సమయాన్ని సంతోషంతో, సానుకూల ఆలోచనలతో నింపడం ఎలా? పొద్దునే ఓ అరగంట సమయాన్ని మనకోసం  కేటాయించుకోవాలి. ముందుగా నడక వంటి తేలికైన వ్యాయామంతో రోజుని ప్రారంభిస్తే శరీరంలో నూతనశక్తి వస్తుంది.
* తెల్లారి.. ఏం వండాలి? అని అప్పుడు ఆలోచించుకునే బదులు... ముందు రోజే ఓ మాట అనుకోండి. వీలైతే మరుసటి రోజు వండాల్సిన కూరగాయలను ముందు రోజురాత్రే కట్‌ చేసుకుంటే, ఉదయం పెద్దగా శ్రమ లేకుండానే వంట త్వరగా పూర్తవుతుంది.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని