వీడ్కోలు దక్కలేదు!
close

తాజా వార్తలు

Published : 18/06/2020 01:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వీడ్కోలు దక్కలేదు!

ఇరవై ఆరేళ్లపాటు ఒకే కాలేజీలో పనిచేసి నేనీమధ్యే రిటైరయ్యాను. ఈ విషయాన్ని మా ప్రిన్సిపల్‌ ఈమెయిల్‌ ద్వారా తెలియచేసి ఊరుకున్నారు. కనీసం సహోద్యోగుల నుంచి ఆత్మీయ వీడ్కోలు కూడా అందుకోలేదు. ఇది నాకు చాలా బాధగా అనిపిస్తోంది? - ఓ సోదరి

ముందుగా పదవీ విరమణ శుభాకాంక్షలు అందుకోండి. ఇరవైఆరేళ్లపాటు సంస్థ తరపున ఎంతోమందికి సేవలందించి ఉంటారు. ప్రస్తుతం లాక్‌డౌన్‌ సందర్భంగా మనమంతా అసాధారమైన పరిస్థితుల్లో జీవిస్తున్నాం. దాంతో ఈ సమయంలో రిటైర్‌ అయినవాళ్లు వారి సేవలకు గుర్తింపుగా తగిన వీడ్కోలు పొందలేకపోవడం విచారకరం. మీ విషయంలోనూ అదే జరిగింది. అది మీకు అసంతృప్తిని కలిగించడం సహజమే. మీ సహోద్యోగులూ లాక్‌డౌన్‌ కారణంగా ఇబ్బందులు పడుతుంటారని ఆలోచించి చూడండి. ఆర్థిక సమస్యలతో ఎంతోమంది సతమతమవుతున్న ఈ సమయంలో.. మీకు సరైన వీడ్కోలు మాత్రమే లభించలేదు. ఒక విధంగా మీరు అదృష్టవంతులే. కాస్త స్థిమితపడిన తర్వాత మీరే సహోద్యోగులకు ఫోన్‌ చేసి మాట్లాడండి. ఉద్యోగ సమయంలో వాళ్లు అందించిన సహకారానికి కృతజ్ఞతలు తెలపండి. ప్రతి ఉద్యోగి జీవితంలోనూ పదవీవిరమణ అనేది గుర్తుంచుకోదగిన సంఘటన. ప్రస్తుత పరిస్థితుల కారణంగా వాళ్లు మీకు సాదరంగా వీడ్కోలు చెప్పలేకపోయారనే విషయాన్ని గుర్తించండి. కాస్త విశాలంగా ఆలోచించడం అలవాటు చేసుకుంటే మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. రిటైర్‌మెంట్‌ తర్వాతి జీవితాన్ని కుటుంబ సభ్యులు, స్నేహితులతో మీరెంతో సంతోషంగా గడపాలని కోరుకుంటున్నా.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని